యష్ 'టాక్సిక్'.. ఇదే లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తే..
సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తిని కలిగించగలిగితే.. బాక్సాఫీస్ వద్ద అంత భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉంటాయి.
సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తిని కలిగించగలిగితే.. బాక్సాఫీస్ వద్ద అంత భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై అంచనాలను పెంచుతున్న మేకర్స్.. ఇదే స్పీడ్ సినిమా రిలీజ్ వరకు కొనసాగిస్తే తొలి రోజు వసూళ్లు మరో స్థాయికి చేరుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. యష్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని తీసుకొచ్చాయి. తాజాగా విడుదల చేసిన లేడీస్ అండ్ లేడీస్ ప్రమోషనల్ వీడియోతో ఆ హైప్ మరింత పెరిగింది. ఇందులో కథలోని ఫిమేల్ రోల్స్ ను పవర్ ఫుల్ గా పరిచయం చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. యాక్షన్ మాత్రమే కాకుండా కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్, మిస్టరీ ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పారు.
అదే జోరులో విడుదల చేసిన తొలి పాట తబాహి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. యష్, కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ, సాంగ్ షూటింగ్, విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తక్కువ సమయంలోనే ఆ సాంగ్ కు భారీ వ్యూస్ రావడం సినిమాపై ఉన్న ఆసక్తికి ఎగ్జాంపుల్ గా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ ఇమేజ్ ఉన్న సినిమాకు రొమాంటిక్ యాంగిల్ ను యూడ్ చేయడం ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని పెంచింది.
ప్రస్తుతం టాక్సిక్ మూవీ ప్రమోషన్స్ ను గమనిస్తే.. ప్రతి కంటెంట్ ఒక కొత్త యాంగిల్ ను పరిచయం చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకసారి యాక్షన్, మరోసారి ఫిమేల్ లీడ్ రోల్స్, ఇంకోసారి రొమాంటిక్ ట్రాక్.. ఇలా వేరియేషన్స్ ను చూపిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇదే ప్లాన్ ను విడుదల వరకు కొనసాగించగలిగితే సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాలకు తొలి రోజు వసూళ్లు అత్యంత కీలకం. ముఖ్యంగా సౌత్ తోపాటు నార్త్ లో కూడా మంచి ఓపెనింగ్స్ రావాలంటే విడుదలకు ముందు స్ట్రాంగ్ ప్రమోషన్స్ కంపల్సరీ. ఆ విషయంలో టాక్సిక్ టీమ్ ఇప్పటివరకు సరైన దిశలోనే అడుగులు వేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఇదే ప్రమోషనల్ జోష్ ను చివరి వరకు కొనసాగించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలబెట్టగలిగితే.. యష్ టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు ఫుల్ గా కనిపిస్తున్నాయి.