పిక్‌టాక్ : రాధికను ఎత్తుకున్న యశ్, ప్రేమకు చిహ్నం
హీరోలు వరుస షూటింగ్స్ కారణంగా కొన్ని సార్లు ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించడం కుదరదు.;
హీరోలు వరుస షూటింగ్స్ కారణంగా కొన్ని సార్లు ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించడం కుదరదు. అందుకే సమయం ఉన్నప్పుడల్లా ఎక్కువగా ట్రిప్స్‌కు వెళ్తూ ఉంటారు. షూటింగ్ ఉన్నప్పుడు బిజీ బిజీగా గడిపే స్టార్స్ షూటింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. కేజీఎఫ్ స్టార్ యశ్ గత కొన్ని రోజులుగా టాక్సిక్, రామాయణ సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ చేయాల్సి రావడంతో నెలల తరబడి ఆయన షూటింగ్ కి డేట్లు ఇస్తూ వచ్చాడు. తాజాగా రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడని తెలుస్తోంది. తన పోర్షన్ షూటింగ్ పూర్తి కావడంతో యశ్ బ్రేక్ తీసుకుంటున్నాడు.
షూటింగ్స్ పూర్తి అయిన వెంటనే యశ్ యూఎస్‌కి వెళ్లాడు. అక్కడ అప్పటికే యశ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. యశ్ రావడానికి కొన్ని రోజుల ముందు వెళ్లిన రాధిక పండిట్ యూఎస్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా యశ్ సైతం అక్కడకి చేరుకున్నాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత యశ్‌ను చూడటంతో రాధిక పండిట్ ఆనందాన్ని దాచుకోలేక పోయింది. యశ్ కలిసిన వెంటనే అతడిని హగ్ చేసుకుంది, యశ్ సైతం ఆమెను ఎత్తుకుని తన ప్రేమను చూపించాడు. రాధిక ను యశ్ ఎత్తుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను స్వయంగా రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పాటు లవ్ ఈమోజీని షేర్ చేసి తమ ప్రేమను చెప్పకనే చెప్పింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన వీరిద్దరు సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన వారు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండటం సాధ్యం కాదేమో అనే అనుమానాలు అప్పట్లో కొందరు వ్యక్తం చేశారు. కానీ యశ్, రాధిక చాలా అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. యశ్ సినిమాలతో బిజీగా ఉండటంతో రాధిక ఇంటి వ్యవహారాలు చూసుకోవడం కోసం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో లేకున్నా రాధిక రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా యశ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడంతో రాధిక వైరల్ అవుతోంది.
యశ్ సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారి పోయాడు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ చివరకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాతో పాటు రణబీర్ కపూర్, సాయి పల్లవి రాముడు సీత పాత్రలో నటిస్తున్న 'రామాయణ' సినిమాలో నటిస్తున్నాడు. ఈయన రామాయణ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. రామాయణ సినిమా నిర్మాణ భాగస్వామిగానూ యశ్ ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో టాక్సిక్ మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామాయణ సినిమా రిలీజ్ డేట్ విషయమై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.