• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వక్ లైలా.. మరీ ఈ...

విశ్వక్ లైలా.. మరీ ఈ రేంజ్ లో ఉహించలేదు బాబు!

| యువ కథానాయకుడు విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో తన కంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-30 09:25 GMT

యువ కథానాయకుడు విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో తన కంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మాస్ కా దాస్ గా పేరు గాంచారు. ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే యంగ్ హీరోల్లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే విశ్వక్ సేన్ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇటీవల ప్రయోగాత్మక చిత్రం గామితో వచ్చి హిట్ అందుకున్నారు.


ఇప్పుడు మరో ప్రయోగాత్మక మూవీ లైలాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ నిన్ననే వచ్చింది. ఆ సమయంలో స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మేకప్ కిట్, అద్దం తదితర వస్తువులతోపాటు చివర్లో గన్‌ నుంచి బుల్లెట్‌ కు బదులు లిప్ స్టిక్ వస్తున్నట్టుగా మేకర్స్ చూపించారు. దీంతో అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటబ్బా అని నెటిజన్లు అంతా తెగ చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య విశ్వక్ కూడా లైలా రోల్ తానే చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో లైలా రోల్ ను విశ్వక్ పోషించడం ఖరారైనట్లే. మేడమ్ మూవీలో రాజేంద్రప్రసాద్ లా ఫుల్ లెంగ్త్ లేడీ రోల్ లో విశ్వక్ సేన్ కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ మూవీ ఫస్టాఫ్ లో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపిస్తారని, సెకండాఫ్ అంతా చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ కామెడీ జోనర్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. సెకండాఫ్ లో విశ్వక్ రగ్డ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఆకాంక్ష శర్మ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తనిష్క్ బాగ్చి ఈ మూవీకి సంగీతం అందిస్తూ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు మేకర్స్.

గతంలో మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, మంచు మనోజ్, నరేష్, అల్లు అర్జున్ తోపాటు పలువురు నటులు లేడీ గెటప్స్ లో కనిపించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ తర్వాత లైలా సెట్స్ లో అడుగుపెట్టనున్నారు విశ్వక్. మరి వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న విశ్వక్.. ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో, లేడీ గెటప్ లో ఎలా అలరిస్తారో చూడాలి.

Happy Birthday to the MASS KA DAS @VishwakSenActor ❤‍🔥

A new chapter begins with #Laila 🌸

Here is the title announcement video!
▶️ https://t.co/8LBnW4NwhH

Directed by @RAMNroars
Starring #AkankshaSharma
Music by #Tanishkbagchi
Audio on @JungleeMusicSTH
Produced by… pic.twitter.com/ln4tiDRwyB

— Shine Screens (@Shine_Screens) March 29, 2024
Tags:    
  • Viswaksen 
  • Laila 
  • Movie 
  • Tollywood 
  • Rajendarprasad 
  • Gangsofgodavari 
  • Mechanicrocky 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS