అర్జున్ కావాల‌నే ఇలా ప్లాన్ చేశాడా?

విశ్వ‌క్ కు క‌మిట్‌మెంట్ లేద‌ని, చెప్పిన మాటపై ఉండ‌డ‌ని అర్జున్ ఎన్నో కామెంట్స్ చేశారు.;

Update: 2026-01-08 06:31 GMT

కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ అర్జున్ డైరెక్ష‌న్ లో విశ్వ‌క్ సేన్ హీరోగా అప్ప‌ట్లో ఓ సినిమా ఓకే అవ‌డం, ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల‌ వ‌ల్ల విశ్వ‌క్ ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, దీంతో అర్జున్ హైద‌రాబాద్ కు వ‌చ్చి మ‌రీ ప్రెస్ మీట్ పెట్టి విశ్వ‌క్ పై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. విశ్వ‌క్ కు క‌మిట్‌మెంట్ లేద‌ని, చెప్పిన మాటపై ఉండ‌డ‌ని అర్జున్ ఎన్నో కామెంట్స్ చేశారు.

ఎందుకు త‌ప్పుకున్నాడో క్లారిటీ ఇచ్చిన విశ్వ‌క్

అయితే ఈ విష‌యంలో అప్పుడేమీ మాట్లాడకుండా ఉన్న విశ్వ‌క్, త‌ర్వాత తాను ఏ సిట్యుయేష‌న్ లో ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చిందో కూడా క్లారిటీ ఇచ్చారు. త‌ర్వాత కొన్నాళ్లకు ఆ ఇష్యూ చ‌ల్ల‌బ‌డింది. విశ్వ‌క్ బ‌య‌ట‌కు రావ‌డంతో అర్జున్ ఆ ప్రాజెక్టును లైట్ తీసుకున్న‌ట్టే క‌నిపించారు కానీ త‌ర్వాత దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లి షూటింగ్ ను పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ కు రెడీ చేశారు.

రిలీజ్ కు రెడీ అయిన సీతాప‌య‌నం

అలా రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమానే సీతా ప‌య‌నం. నిరంజ‌న్ సుధి హీరోగా, అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో ధృవ్ స‌ర్జా, స‌త్య రాజ్, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీతా ప‌య‌నం సినిమాను ఫిబ్ర‌వ‌రి 14న వేలంటైన్స్ డే కానుక‌గా ఆడియ‌న్స్ ముందుకు తీసుకురావ‌డానికి మేక‌ర్స్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ స‌రిగ్గా దానికి ఒక్క రోజు ముందే విశ్వ‌క్ న‌టించిన ఫంకీ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఫంకీకి పోటీగా

వాస్త‌వానికి ఫంకీ ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ లో రిలీజ‌వాల్సింది కానీ త‌ర్వాత ఆ సినిమాను ప్రీ పోన్ చేసి ఫిబ్ర‌వ‌రి 13న రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సీతాప‌య‌నం సినిమాను కూడా అదే వీక్ లో రిలీజ్ చేయ‌నుండ‌టం విశేషంగా మారింది. అర్జున్ కావాల‌ని ఈ సినిమాను విశ్వ‌క్ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నారా? లేదా విశ్వ‌క్ సినిమా కంటే త‌న సినిమా బెట‌ర్ గా పెర్ఫార్మ్ చేస్తుంద‌ని ప్రూవ్ చేసుకోవ‌డానికి ఇలా ప్లాన్ చేశారో తెలియ‌దు కానీ మొత్తానికి సీతాప‌య‌నం మాత్రం బాగానే అటెన్ష‌న్ ను తెచ్చుకుంది.

Tags:    

Similar News