నాగబంధం రిలీజ్ స్ట్రాటజీ.. సోలోగానే..
కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే పెద్దగా పోటీ లేని టైమ్ చూసుకుని ఈ భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ను సోలోగా దించుతున్నారు. బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయనే ఆలోచనతో అభిషేక్ నామా టీమ్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది.
మైథలాజికల్ ఫాంటసీ మూవీ 'నాగబంధం' జూలై 3న థియేటర్లలోకి రాబోతోంది. సమ్మర్ హడావిడి మొత్తం అయిపోయాక, బాక్సాఫీస్ దగ్గర ఏర్పడే గ్యాప్ ను వాడుకోవాలనేది మేకర్స్ సెట్ చేసిన అసలు ప్లాన్ అని అర్ధమవుతుంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే పెద్దగా పోటీ లేని టైమ్ చూసుకుని ఈ భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ను సోలోగా దించుతున్నారు. బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయనే ఆలోచనతో అభిషేక్ నామా టీమ్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది.
ఇక్కడ అందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న పాయింట్ హీరో విరాట్ కర్ణ. కెరీర్ లో చేస్తున్నది రెండో సినిమానే అయినా, ఏకంగా పాన్ ఇండియా సబ్జెక్టును టేకప్ చేశాడు. 1750ల నాటి స్టోరీ, పాత కాలపు నిధులు, దైవిక శక్తులు అనగానే ఎవరైనా పెద్ద స్టార్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ విజువల్స్ ని, స్టోరీని నమ్ముకుని ఒక కొత్త కుర్రాడితో ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడం ట్రేడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా హిట్టయిన మైథలాజికల్ సినిమాలు చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. స్టార్ డమ్ కంటే కూడా కంటెంట్ కే ఆడియన్స్ ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. నాగబంధం పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ దండయాత్రల నుంచి దేశ సంపదను, గుళ్లలో దాగి ఉన్న రహస్యాలను కాపాడే శివుని అంశతో నడిచే స్టోరీ ఇది. ఇలాంటి కథ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మాత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇవ్వడం గ్యారెంటీ.
యంగ్ హీరోకి సపోర్ట్ గా సినిమాలో భారీ కాస్టింగ్ సెట్ చేశారు. జగపతి బాబు లాంటి సీనియర్ యాక్టర్ ఓ కీ రోల్ చేస్తుండటం సినిమాకు పెద్ద ప్లస్. ఇక గ్లామర్ డోస్ కోసం నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లాంటి బ్యూటీస్ ఉన్నారు. లేటెస్ట్ గా రిలీజైన సుర సుర పాట చూస్తే సినిమా మాస్ ఆడియన్స్ కు కూడా బాగా రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారని అర్థమవుతోంది. పెళ్లి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ఫోక్ సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది.
ఇలాంటి పీరియాడిక్ కథలు తెరపై వర్కవుట్ అవ్వాలంటే టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వందల ఏళ్ల క్రితం నాటి ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచాలంటే ఆర్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ దే కీ రోల్. లేటెస్ట్ పోస్టర్ లో డీటెయిలింగ్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో చీకటికి, వెలుగుకు మధ్య జరిగే ఫైట్ ను చాలా రిచ్ గా చూపించబోతున్నారు. ఇక జూలై 3వ తేదీ నాగబంధం టీమ్ కు ఒక పెద్ద టెస్ట్. పోటీ లేని టైమ్ లో వస్తున్నారు కాబట్టి, ఫస్ట్ డే మార్నింగ్ షోకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఒక యంగ్ హీరో, భారీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే ఇంకో నెల రోజులు ఆగాల్సిందే.