• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లియో కోసమైనా విజయ్ తెలుగు...

లియో కోసమైనా విజయ్ తెలుగు ప్రమోషన్స్ చేస్తాడా..?

| అయితే ఈ పరిస్థితి గమనించిన విజయ్ లియో సినిమాకు తెలుగు ప్రమోషన్స్ కూడా చేయాలని చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-12 08:46 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లియో. ఈ సినిమాను లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కమల్ విక్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ విజయ్ తో అంతకుమించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. లియో గ్లింప్స్ ఇప్పటికే ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించగా సినిమా తప్పకుండా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటున్నారు. మామూలుగానే దళపతి విజయ్ తన ప్రతి సినిమాతో తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటాడు.

ఆయన సినిమా యావరేజ్ టాక్ వచ్చినా సరే కోలీవుడ్ లో హిట్ సినిమా వసూళ్లను రాబడుతుంది. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల మోత మోగాల్సిందే. తమిళంలోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా విజయ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలు మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. అయితే విజయ్ తను నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తాడు కానీ ఒక్క సినిమా ప్రమోషన్స్ కి కూడా ఇక్కడకు రాలేదు. అప్పుడెప్పుడే మురుగదాస్ తుపాకి సినిమాకు హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చేశాడు.

ఆ తర్వాత చాలా సినిమాలు తెలుగులో రిలీజై మంచి హిట్ అందుకున్నా తెలుగు ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ ఇయర్ వచ్చిన వారిసు సినిమా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత చేశారు. కానీ ఆ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ టైం లో కూడా విజయ్ ఇక్కడకు రాలేదు. ఇక్కడ మార్కెట్ అయితే కావాలి కానీ మన దగ్గరకు ప్రమోషన్స్ కు మాత్రం విజయ్ రావట్లేదని తెలుగు ఆడియన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఈ పరిస్థితి గమనించిన విజయ్ లియో సినిమాకు తెలుగు ప్రమోషన్స్ కూడా చేయాలని చూస్తున్నారు.

లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రం, మాస్టర్ సినిమాలు అన్నీ తెలుగులో మంచి ఫలితాలు అందుకున్నాయి. అలాంటి లోకేష్ డైరెక్ట్ చేస్తున్న లియో సినిమాకు తెలుగులో క్రేజ్ తెచ్చేందుకు దళపతి విజయ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ హీరోలు కూడా తమ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇక్కడ రిలీజ్ అవుతుంటే హైదరాబాద్ లో ఈవెంట్ ఫిక్స్ చేస్తున్నారు. మిగతా తమిళ హీరోలైన రజిని, కమల్ సినిమాలకు ఇక్కడ ఈవెంట్స్ చేస్తున్నారు. కానీ విజయ్ ఆ విషయంలో ఎందుకో ఆసక్తిగా లేరు కానీ లియోకి మాత్రం ఈసారి విజయ్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.

Tags:    
  • Kollywood 
  • Tahalapathy 
  • Vijay 
  • Leo 
  • Lokeshkangaraj 
  • Movie 
  • Telugupromotions 
  • Panindia 
  • Sanjaydutt 
  • Lalithkumar 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS