విజయ్‌ రాజకీయాలపై హీరోయిన్‌ కామెంట్స్‌!

దేశవ్యాప్తంగా సినీ తారలు రాజకీయాల్లో అడుగు పెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కనుక విజయ్‌ రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, ఆయన కింగ్‌ అవుతాడా లేదంటే కింగ్‌ మేకర్‌గా అయినా నిలుస్తారా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు.;

Update: 2025-05-27 07:30 GMT

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ఇప్పటికే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి వచ్చే ఏడాదిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం మాత్రమే కాకుండా సాధ్యం అయితే అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాట ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయ్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతారు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ తారలు రాజకీయాల్లో అడుగు పెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కనుక విజయ్‌ రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, ఆయన కింగ్‌ అవుతాడా లేదంటే కింగ్‌ మేకర్‌గా అయినా నిలుస్తారా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయబోతున్నారు. రాజకీయ నేపథ్యం ఉండే సన్నివేశాలతో జన నాయకన్‌ సినిమా ఉంటుంది అంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ జన నాయకన్‌ సినిమా తన చివరి సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లినా సినిమా ఇండస్ట్రీలో నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. విజయ్‌ తో కలిసి నటించిన వారు చాలా మంది స్టార్స్ కచ్చితంగా విజయ్‌ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా ఇండస్ట్రీలో కూడా కొనసాగాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సిమ్రాన్‌ ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో సిమ్రాన్ మాట్లాడుతూ... విజయ్‌ గొప్ప వ్యక్తి. ఆయన ఏ పని చేసినా అత్యుత్తమ ప్రతిభను కనబర్చుతాడు అనే నమ్మకం నాకు ఉంది. సినిమాల్లో ఆయన ఎలా అయితే సూపర్‌ స్టార్‌గా ఎదిగారో అలాగే రాజకీయాల్లోనూ ఆయన విజయాలను సొంతం చేసుకుంటారు. రాజకీయాల్లో విజయ్ అత్యుత్తమ ప్రతిభను కనబర్చడం ద్వారా తనదైన ముద్ర వేస్తారని ఆశిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది విజయ్‌ కి మద్దతు తెలుపుతున్నారు. ఆయన ఇండస్ట్రీలో కొనసాగకున్నా రాజకీయాల్లో మంచి విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.

కోలీవుడ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు విజయ్ అధికారంలోకి రావాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. తాజాగా సిమ్రాన్‌ బాహాటంగా మీడియా ముందుకు వచ్చి విజయ్‌ రాజకీయాల్లో కచ్చితంగా సక్సెస్‌ అవుతాడు అంటూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన అభిమానులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సిమ్రాన్ వ్యాఖ్యలను తెగ వైరల్‌ చేస్తున్నారు. విజయ్‌ సినిమాల్లో ఎంత క్రమ శిక్షణతో ఉన్నాడో అలాగే రాజకీయాల్లోనూ అంతే క్రమశిక్షణతో ఉంటాడు అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తమిళనాట ఉన్న రాజకీయ పరిస్థితుల్లో విజయ్‌ నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. కానీ ప్రజల్లో తన పార్టీ పట్ల నమ్మకం కలిగిస్తే విజయ్‌ హిట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News