గ్లోబల్ లెవెల్‌లో రౌడీ స్టార్.. హాలీవుడ్ కనెక్షన్‌తో క్రేజ్ డబుల్!
టాలీవుడ్‌లో ఇప్పుడు ప్యాన్-ఇండియా ట్రెండ్ దాటి ప్యాన్-వరల్డ్ హవా నడుస్తోంది. మన భారీ బడ్జెట్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ మెరవడం ఇప్పుడు కామన్ అయిపోయింది.
టాలీవుడ్‌లో ఇప్పుడు ప్యాన్-ఇండియా ట్రెండ్ దాటి ప్యాన్-వరల్డ్ హవా నడుస్తోంది. మన భారీ బడ్జెట్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ మెరవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఊపిరి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలలో ఇంటర్నేషనల్ నటులు తెలుగు స్క్రీన్‌పై సందడి చేశారు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ లోకి ఒక లెజెండరీ హాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇవ్వడంతో రౌడీ స్టార్ క్రేజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరుకుంది. ఆ వివరాలు చూద్దాం..
‘రణబాలి’లో ది మమ్మీ విలన్ హల్‌చల్:
వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ మూవీ 'ది మమ్మీ' లో విలన్‌గా మెప్పించిన ఆర్నాల్డ్ వోస్లూ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. 'రణబాలి' అనే ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఆయన 'సర్ థియోడర్ హెక్టర్' అనే పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, హాలీవుడ్ విలన్ ఆర్నాల్డ్ వోస్లూల మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ లో రచ్చ లేపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’తో మొదలైన సంచలనం:
మన టాలీవుడ్ సినిమాల్లోకి హాలీవుడ్ నటులను పవర్‌ఫుల్ గా తీసుకురావడంలో జక్కన్న రూటే వేరు. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ హిట్ 'ఆర్ఆర్ఆర్' లో బ్రిటీష్ క్రూరమైన దొరలుగా రే స్టీవెన్సన్, అలిసన్ డూడీలు అద్భుతంగా నటించారు. అలాగే ఎన్టీఆర్ సరసన జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ మన తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తోనే ఇప్పుడు మన మేకర్స్ హాలీవుడ్ వైపు చూస్తున్నారు.
‘విశ్వంభర’లో చిరుతో థామస్ జేన్ పోటీ:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర' చిత్రంలో కూడా హాలీవుడ్ నటుడు థామస్ జేన్ నటిస్తున్నారు. ఇలాంటి భారీ చిత్రాలలో ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఉండటం వల్ల సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అలాగే గతంలో అక్కినేని నాగార్జున నటించిన 'ఊపిరి' సినిమాలో గాబ్రియేల్లా డెమిట్రియాడ్స్ ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసి ప్రేక్షకులను అలరించింది.
ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన టాలీవుడ్, ఇప్పుడు హాలీవుడ్ స్టార్లను సైతం ఇక్కడికి రప్పించే స్థాయికి ఎదిగింది. విజయ్ దేవరకొండ ‘రణబలి’ చిత్రానికి ఆర్నాల్డ్ వోస్లూ లాంటి హాలీవుడ్ నటుడు తోడవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ హాలీవుడ్ కనెక్షన్ మన రౌడీ స్టార్ మార్కెట్‌ను గ్లోబల్ లెవెల్‌లో ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో చూడాలి..