విజయ్ దేవరకొండ: ఫిల్మ్‌ఫేర్ మాస్ ఎలివేషన్స్!
టాలీవుడ్‌లో మాస్ హీరోగా, క్రేజీ యూత్ ఐకాన్‌గా విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్‌లో మాస్ హీరోగా, క్రేజీ యూత్ ఐకాన్‌గా విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ‘పెళ్లి చుపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్‌డమ్ సాధించిన విజయ్, తన రఫ్ అండ్ టఫ్ యాటిట్యూడ్‌తో అభిమానులను ఆకర్షిస్తాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ డెప్త్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తాడు. ఈ క్రేజ్‌తోనే విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు.
ఈమధ్య కాలంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’ సినిమాలు ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ, విజయ్ దేవరకొండ క్రేజ్‌లో ఎలాంటి తగ్గుదల లేదు. అతని సినిమాల కోసం యూత్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. స్టైల్, ఎనర్జిటిక్ ప్రజెన్స్, సిన్సియర్ నటనతో అభిమానులను అలరిస్తాడు. ఈ అద్భుతమైన ఆకర్షణ, అరుదైన స్టైల్ తో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ కవర్ స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు.
మే ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్‌లో విజయ్ దేవరకొండ మాస్ లుక్‌లో కనిపించాడు. బ్లాక్ లెదర్ జాకెట్, రఫ్ హెయిర్‌స్టైల్‌తో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. విజయ్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాడు అనే క్యాప్షన్ తో మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం విశేషం. విజయ్ మార్క్ స్టైల్ అరుదైనదని, అతనిలో డెస్టినీ టచ్ ఉందని పేర్కొంది. ఈ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ఇక విజయ్ దేవరకొండ రాబోయే సినిమాల విషయానికి వస్తే ‘కింగ్‌డమ్’ కూడా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జులై 4న విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ్‌కు మరో హిట్‌ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అంతేకాకుండా, విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో ఒక డిఫరెంట్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక వింటేజ్ డ్రామాగా రూపొందుతోంది, ఇందులో విజయ్ ఓ రివొల్యూషనరీ రోల్‌లో కనిపించనున్నాడు. 2026 చివరిలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, 2027లో విడుదల కానుందని టాక్. ఈ రెండు సినిమాలతో విజయ్ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.