• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విద్యా బాల‌న్ రెబ‌లియ‌న్...

విద్యా బాల‌న్ రెబ‌లియ‌న్ యాటిట్యూడ్

| తాజాగా ప్ర‌ఖ్యాత గ్లోబ‌ల్ స్పా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం బాల‌న్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని వేడెక్కించింది. బాల‌న్ ఫ్లోర‌ల్ డిజైన‌ర్ దుస్తుల్లో ఎంతో అందంగా క‌నిపించింది.

By - Tupaki Desk
Update: 2024-01-17 15:30 GMT

ట్రెడిష‌న‌ల్ శారీలో ఎంత అందంగా క‌నిపిస్తుందే, మాస్ రెబ‌లియ‌న్ స్టైల్ లోను అంత‌కుమించి అని నిరూపించ‌డం బాల‌న్ కే చెల్లింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన బాల‌న్, అందుకు పూర్తి భిన్నంగా 'డ‌ర్టీ పిక్చ‌ర్'లో సిల్క్ స్మిత‌గా న‌టించి మెప్పించారు. త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌కు అద్దంప‌ట్టిన సినిమాలు అవి. న‌టిగా బాల‌న్ ఏ ఇత‌ర క‌థానాయిక‌తో పోల్చినా విల‌క్ష‌ణ‌మైన కెరీర్ ని క‌లిగి ఉంది.


ఇక నేటిత‌రంతో పోటీప‌డుతూ ఫోటోషూట్ల‌లోను బాల‌న్ పాల్గొంటున్నారు. తాజాగా ప్ర‌ఖ్యాత గ్లోబ‌ల్ స్పా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం బాల‌న్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని వేడెక్కించింది. బాల‌న్ ఫ్లోర‌ల్ డిజైన‌ర్ దుస్తుల్లో ఎంతో అందంగా క‌నిపించింది. ఇక ఫోటోషూట్ కోసం త‌న ఫోజ్ రెబ‌లియ‌న్ యాటిట్యూడ్ ఎలివేట్ అయిన తీరు షాకిస్తోంది.

2024 సంవత్సరానికి సంబంధించిన మా మొదటి కవర్ పై విద్యాబాలన్ (@balanvidya ) రూప‌మిది. అభిప్రాయాలు ఘోషించే రాజ్యంలో... విద్య తన స్వంత సినీ కెరీర్ కి అనుగుణంగా కవాతు చేస్తూ ఎవ‌రూ తాక‌లేనంత ఎత్తున ఉన్నారు. త‌న‌ ప్రయాణంలో ఎన్నో వైవిధ్య‌మైన‌ పాత్రలతో మెప్పించ‌డమే కాదు.. జీవితాన్ని ఉత్సాహంగా స్వీకరించడంలోను బాల‌న్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు... అని తెలిపారు.

ఫేక్ ప్రొప‌గండా న‌మ్మొద్దు:

ఇటీవ‌ల విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని దురదృష్టకర వార్తల గురించి తన స్నేహితులు కుటుంబ సభ్యులను హెచ్చరించింది. గుర్తుతెలియని వ్యక్తి త‌న‌లా నటించడంపై బాల‌న్ తాను ఎదుర్కొంటున్న సమస్యను వెలుగులోకి తెచ్చింది. లక్షలాది మంది ప్రజలు తనను అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ వంటి పబ్లిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం బాధాకరం అని బాల‌న్ పేర్కొంది. అచ్చం త‌న‌లానే నటించే వ్యక్తి త‌న‌ పేరుతో ఇన్ స్టా, వాట్సాప్ ల‌లో ఉన్నార‌ని ఇది నమ్మదగిన నకిలీగా మారిందని బాల‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను మెసేజ్ చేస్తున్న‌ట్టు వారు ర‌క‌ర‌కాల మెసేజ్ లు పంపుతున్నార‌ని కూడా క‌ల‌త‌కు గురైంది. విద్యాబాలన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న స్నేహితులు, కుటుంబ సభ్యులను హెచ్చరించింది. జనవరి 16న విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఆందోళనకరమైన సమస్యను వెలుగులోకి తెచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్ ద్వారా తనను అనుకరిస్తున్నాడని వెల్లడించింది. ఒక వ్యక్తి ఈ నంబర్‌ను ఉపయోగిస్తున్నాడు .. నా అని చెప్పుకునే వ్యక్తులకు చేరువయ్యాడు.. నా ఫోటోని వాట్సాప్ ప్రొఫైల్‌-డిపీగా ఉపయోగిస్తున్నాడు. దయచేసి ఈ వ్యక్తి నుండి ఎటువంటి కాల్‌లు లేదా సందేశాలను స్వీకరించవద్దు అని కోరింది.

విద్యాబాలన్- ప్రతీక్ గాంధీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన త‌దుప‌రి చిత్రం గురించి జనవరి 17న ఒక‌ పెద్ద ప్రకటన కోసం వేచి ఉండాల‌ని కూడా బాల‌న్ కోరింది.

Tags:    
  • Bollywood 
  • Actress 
  • Vidyabalan 
  • Actressvidya 
  • Socialmedia 
  • Phototalk 
  • Photoshoot 
  • Globalspa 
  • Magazine 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS