విక్కీ కౌశల్ 'మహావతార్' ఎట్టకేలకు..!
ఏడాది కాలంగా విక్కీ కౌశల్ మహావతార్ సినిమాలో నటిస్తాడని ప్రచారమవుతోంది. మడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, అమర్ కౌశిక్ దీనికి దర్శకత్వం వహిస్తారని కథనాలొచ్చాయి.;
ఏడాది కాలంగా విక్కీ కౌశల్ మహావతార్ సినిమాలో నటిస్తాడని ప్రచారమవుతోంది. మడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, అమర్ కౌశిక్ దీనికి దర్శకత్వం వహిస్తారని కథనాలొచ్చాయి. మహావతార్ లుక్ లు కూడా ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ లేదు.
తాజా ఇంటర్వ్యూలో దర్శకరచయిత అమర్ కౌశిక్ హింట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని తెలిపారు. సినిమా వాయిదా పడింది. ఆరేడు నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సెట్ డిజైన్, ఆయుధ డిజైన్, ప్రతి పాత్ర ఎలా ఉంటుందో వీటన్నిటి కోసం పనిచేశాం. స్క్రిప్టింగ్ పూర్తయింది. కానీ మాకు ఇంకా ఎక్కువ సమయం కావాలి. విక్కీ తన ఇతర కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత మహావతార్ కోసం తన ప్రిపరేషన్‌ను ప్రారంభిస్తాడు. కాబట్టి వచ్చే ఏడాది మధ్యలో సెట్స్‌పైకి వెళ్లాలని ఆశిస్తున్నాం! అని అమర్ కౌశిక్ అన్నారు.
ఇది చాలా పెద్ద ఫ్యాషనేట్ ప్రాజెక్ట్ అని కూడా అమర్ కౌశిక్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో చదువుకునే రోజుల్లో దగ్గర్లోనే పరశురామ కుండ్ ఉండేది. పరశురాముడు ఎవరు? అని నేను నా తల్లిని అడిగేవాడిని.. కానీ దాని గురించి పెద్దగా మాట్లాడకూడదని నాకు చెప్పారు. అతడు చాలా కోపంగా ఉంటాడని మాత్రమే నాకు చెప్పారు. అందుకే ఆ పాత్ర నన్ను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆ పాత్ర గురించి చదివి తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అని తెలిపారు. వీఎఫ్ఎక్స్ పై మంచి అవగాహన వచ్చిందని, అది ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి తనకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చిందని అమర్ తెలిపారు. స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చినందున మడాక్ నాకు పెద్ద బాధ్యతను అప్పజెప్పింది. దానిని నెరవేర్చాల్సి ఉందని కూడా అన్నారు.