ఎల్లమ్మ కోసం ఫ్రెష్ ఫేస్ కావాల్సిందేనా?

ఒక దశలో ఆమె సెలెక్షన్ దాదాపు ఖాయమైందన్న ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు.. శృతి హాసన్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత్ వంటి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.;

Update: 2026-05-11 07:32 GMT

బలగం సినిమాతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా ఎల్లమ్మపై పూర్తి దృష్టి పెట్టారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఆ మూవీని స్ట్రాంగ్ ఎమోషన్స్, ఫోక్ కల్చర్, డివోషనల్ ఎలిమెంట్స్ తో తీయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ సెలక్షన్ పై గత కొంతకాలంగా పెద్ద చర్చ నడుస్తోంది.

సినిమాలో హీరోయిన్ రోల్ కు యాక్టింగ్ కు ఫుల్ స్కోప్ ఉండటంతో వేణు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారని సమాచారం. మొదట ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ గ్రామీణ యువతి పాత్రకు ఆమె సరిపోతుందని యూనిట్ భావించినప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపించింది.

ఒక దశలో ఆమె సెలెక్షన్ దాదాపు ఖాయమైందన్న ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు.. శృతి హాసన్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత్ వంటి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం కొత్త హీరోయిన్ వైపు దర్శకుడు మొగ్గు చూపుతున్నారని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్‌ కు జోడీగా ఫ్రెష్ ఫేస్ ఉంటే కథకు కొత్తదనం వస్తుందని యూనిట్ భావిస్తోందట.

అందుకే కొత్త అమ్మాయి కోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా ఎల్లమ్మ కోసం ఫ్రెష్ ఫేస్ కావాల్సిందేనని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా కనిపించడమే. ఎన్నో బ్లాక్‌ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన డీఎస్పీ ఇప్పుడు పార్శి అనే పవర్‌ఫుల్ పాత్రతో నటుడిగా కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ లో ఆయన లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రామీణ గెటప్‌ లో డీఎస్పీ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు, సినిమాకు సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. ఎల్లమ్మ కథ తెలంగాణ సంప్రదాయాలకు దగ్గరగా ఉండబోతున్నట్లు ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ ద్వారా అర్థమైంది. వేప ఆకులు, పసుపు, కుంకుమ, గజ్జెల శబ్దాలు, జాతర వాతావరణం వంటి విజువల్స్ సినిమాపై ప్రత్యేక ఆసక్తి పెంచాయి. వేణు యెల్దండి మరోసారి బలగం తరహాలో మన సంస్కృతిని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారని ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

ఇక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, హీరోయిన్ ఎంపిక పూర్తైన వెంటనే జూన్‌ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వేణు యెల్దండి దర్శకత్వం, డీఎస్పీ హీరోగా ఎంట్రీ, తెలంగాణ బ్యాక్‌ డ్రాప్ వంటి ఎలిమెంట్స్ తో ఎల్లమ్మపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News