మరో హీరో కాంపౌండ్ లో వేణు 'ఎల్లమ్మ'..?

కమెడియన్ వేణు యెల్దండి.. బలగం మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-10-11 16:32 GMT

కమెడియన్ వేణు యెల్దండి.. బలగం మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. డెబ్యూ మూవీ తర్వాత నుంచి ఎల్లమ్మ ప్రాజెక్టుపై స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఆ సినిమా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా ఉన్న ఎల్లమ్మ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఎల్లమ్మ మూవీ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నట్లు ఓ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు తెలిపారు. అంతే కాదు.. నితిన్ రీసెంట్ గా నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎల్లమ్మ సినిమాను స్టార్ట్ చేస్తామని చెప్పారు.

కానీ ఇప్పటి వరకు ఎలాంటి సందడి లేదు. అయితే కొద్ది రోజుల క్రితం నితిన్.. ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. నితిన్ బదులు మరో హీరో నటిస్తున్నారని టాక్ వచ్చింది. శర్వానంద్ ను బోర్డులోకి తీసుకోనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికే శర్వానంద్ కు కథ చెప్పారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎల్లమ్మ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంపౌండ్ లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఆయనతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయని వినికిడి. త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్.

అన్నీ అనుకున్నట్లు జరిగితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. రీసెంట్ గా బెల్లంకొండ కిష్కింధపురి మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు.

మరికొద్ది రోజుల్లో టైసన్ నాయుడు మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ లో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు సెట్స్ పై ఉన్న ఆ మూవీ ఇప్పుడు విడుదల అవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్టు ఆయన లైనప్ లో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News