• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొంచెం త్రివిక్రమ్ కు...

కొంచెం త్రివిక్రమ్ కు ఫోన్ చేసి అడుగుతారా?

| ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జర్నలిస్ట్ లతో వెంకటేశ్ కాసేపు ఇంట్రాక్షన్ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సైంధవ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-03 12:43 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వహించిన సినిమా వచ్చి ఎన్నాళ్లు అయిందో గుర్తుందా? ఈ సంక్రాంతికి నాలుగేళ్లు అవుతుంది. 2020లో సంక్రాంతికి ఆయన డైరెక్ట్ చేసిన అల వైకుంఠపురములో సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెద్ద పండుగకు మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం వస్తుంది. అయితే దర్శకుడిగా ఆయనకు బాగా గ్యాప్ వచ్చింది.

గుంటూరు కారం తర్వాత ఈసారి గ్యాప్ రాకుండా ఉండాలని త్రివిక్రమ్ ప్లాన్-బి రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ ను పక్కన పెట్టి విక్టరీ వెంకటేశ్, నేచురల్ స్టార్ నాని హీరోలుగా మల్టీస్టారర్ తెరకెక్కిస్తారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు ఆ మల్టీ స్టారర్ కహానీపై హీరో వెంకటేశ్ స్పందించారు. ఆయన నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జర్నలిస్ట్ లతో వెంకటేశ్ కాసేపు ఇంట్రాక్షన్ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సైంధవ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ సమయంలో "త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటున్నారు.. అది ఎప్పుడు ఉండొచ్చు.. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి" అని వెంకటేశ్ ను అడిగారు. వెంటనే దానికి సమాధానంగా 'బాబూ ఇప్పుడు ఎవరో ఒకరు త్రివిక్రమ్ కు కాల్ చేసి అడగండమ్మా' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు వెంకీ మామ. త్రివిక్రమ్ ను అడిగితే క్లారిటీ వస్తుందన్నట్లు వెంకీ ఆన్సర్ ఇచ్చారు.

దీంతో విలేకరులంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు వెంకటేశ్ ఫ్యాన్స్.. త్రివిక్రమ్ మల్టీస్టారర్ ఒక రూమర్ మాత్రమేనని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సడెన్ సర్ ప్రైజ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రచయితగా త్రివిక్రమ్.. వెంకటేశ్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలను అందించారు. మరి ఈ మల్టీస్టారర్ గురించి త్రివిక్రమ్, నానిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Victory 
  • Venaktesh 
  • Saindhav 
  • Media 
  • Trivikram 
  • Movie 
  • Nani 
  • Multistarrer 
  • Trailerlaunch 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS