వరుణ్ డిజాస్టర్ మూవీ.. వెబ్ సిరీస్ గా వస్తుందా?

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రిన్స్.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.;

Update: 2025-04-25 08:24 GMT

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రిన్స్.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కానీ కొంత కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకో గానీ.. ఆయన సినిమాలు క్లిక్ అవ్వడం లేదు.

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. అందులో ఒకటైన మట్కా సినిమాలో ఆయన వివిధ భిన్నమైన రోల్స్ లో సందడి చేశారు. బాక్సాఫీస్ వద్ద సినిమా డిజాస్టర్ గా మారినా.. వరుణ్ తేజ్ మాత్రం తన లుక్స్ అండ్ యాక్టింగ్ టాలెంట్ తో అలరించారని చెప్పాలి.

అయితే మట్కా మూవీ కోసం ఇప్పుడెందుకు చర్చ అనుకుంటున్నారా? నిజానికి.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆయన తాను నటిస్తున్న మట్కా కింగ్ వెబ్ సిరీస్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నానని తెలిపారు. ఓ కేక్ తో పాటు రెడ్ క్లాత్ ఉన్న పిక్ ను షేర్ చేశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్న ఆ సిరీస్ కు సైరత్ ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే మట్కా కింగ్ సిరీస్.. ముంబయిలో గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తీస్తున్నట్లు తెలుస్తోంది. 60స్ కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

దీంతో మట్కా కింగ్ సిరీస్ కథాంశం.. వరుణ్ మట్కా స్టోరీలా అనిపిస్తుందని చెప్పాలి. అయితే అప్పుడు డిజాస్టర్ అయిన మట్కా మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సిరీస్ రూపంలో తీసుకొస్తున్నారా అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. మట్కా స్టోరీ లైన్ తీసుకుని కొత్తగా తీశారేమోనని ఇంకొందరు మూవీ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే నాగరాజ్ మంజులే మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. విజయ్ వర్మ తన యాక్టింగ్ తో ఎప్పుడూ మెప్పిస్తుంటారు. ఆయనతోపాటు సిరీస్ లో గుల్షన్ గ్రోవర్, కృతికా కమ్రా, సాయి తమ్హంకర్ సహా పలువురు ఉన్నారు. మరి మట్కా కింగ్ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో.. ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News