వ‌రుణ్ లైఫ్ లో బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ అదేన‌ట‌!

సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న తర్వాత సాధారణంగా ఆస్తుల కొనుగోళ్లు కూడా లగ్జరీ ప‌రంగానే వార్తల్లో నిలుస్తుంటాయి.

Update: 2026-08-21 02:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సినీ సెల‌బ్రిటీలు తమ కొత్త సినిమాలు, ఖరీదైన కార్లు, లగ్జరీ ఇళ్లు, వెకేషన్ ఫొటోలతో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. అయితే వరుణ్ మాత్రం తన లైఫ్ లో ఎంతో స్పెష‌ల్ గా భావిస్తున్న ఓ ప‌ర్స‌న‌ల్ స‌క్సెస్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. అదే.. ఓ పొలాన్ని కొనుగోలు చేయడం.

వ‌రుణ్ ధావ‌న్ కు సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, గుర్తింపు ఉన్నాయి. స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు వరుస ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను కూడా ఏర్పరుచుకున్నారు. అలాంటి వ్యక్తి తన కెరీర్‌కు సంబంధించిన స‌క్సెస్‌ల కంటే భూమి కొనుగోలును తన లైఫ్ లోని బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ గా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడే వరుణ్ ఆలోచనా విధానంలో కనిపిస్తున్న మరో కోణం ఆసక్తికరంగా ఉంది. సినీ ప్రపంచంలో ఉండే గ్లామర్, రెగ్యుల‌ర్ షూటింగ్ షెడ్యూల్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్‌తో నిండిన లైఫ్ కు భిన్నంగా.. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపడం తన‌కెంత ఆనందాన్ని ఇస్తుందో అతడు స్వయంగా వీడియోలో చూపించారు. కొత్తగా కొన్న భూమిలో కొంతసేపు గడుపుతూ కామ‌న్ మ్యాన్ లాగా టీ, బిస్కెట్లు ఆస్వాదించడం అతడి ఆనందాన్ని మరింత స్పష్టంగా చూపించింది.

సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న తర్వాత సాధారణంగా ఆస్తుల కొనుగోళ్లు కూడా లగ్జరీ ప‌రంగానే వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ వరుణ్ విషయంలో మాత్రం ఆస్తి విలువ కంటే దానితో తనకు లభిస్తున్న అనుభూతికే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసే కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఇచ్చే సౌకర్యాల కంటే.. తన సొంత భూమిపై నిలబడి ప్రకృతిని ఆస్వాదించడం అతడికి ప్రత్యేకమైన అనుభూతిగా మారినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫామ్‌ను ఫ్యూచ‌ర్‌లో ఎలా ఉపయోగించనున్నాడు? వ్య‌వ‌సాయంపై ఇంట్రెస్ట్ తో వ‌రుణ్ ఆ భూమిని కొన్నాడా లేక వ్య‌క్తిగ‌త విశ్రాంతి కోసం ఉపయోగించనున్నాడా? అనే విషయాలపై వరుణ్ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ అతడి మాటలు, ఉత్సాహం చూస్తే మాత్రం ఈ కొనుగోలు అతని ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి, స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న వరుణ్ ధావన్‌కు ఇప్పుడు మరో కొత్త ప్రపంచం దొరికింది. అది సినిమాల వెలుగులకు దూరంగా.. పచ్చని భూమి మధ్య తనదైన ప్రశాంతతను వెతుక్కునే ప్రపంచం. అందుకే కావచ్చు.. ఈ భూమినే తన లైఫ్ లోని అతిపెద్ద స‌క్సెస్ గా వ‌రుణ్ భావిస్తున్నారు.

Tags:    

Similar News