'వారణాసి' గ్లింప్స్.. వ్యూస్ సంగతేంటి?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.;

Update: 2025-11-18 05:23 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ భారీ ప్రాజెక్టు కోసం అటు సినీ ప్రియులు.. ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రీసెంట్ గా మూవీ నుంచి మ్యాసివ్ అప్డేట్ వచ్చిన సంగతి విదితమే. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. మూడు నిమిషాల నిడివితో ఉన్న వారణాసి టు ది వరల్డ్ గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియాలోనూ రిలీజ్ చేయగా.. ఇప్పటికే పుల్ వైరల్ గా మారింది.

గ్లింప్స్‌ లో వారణాసి 512 CE, గ్రహశకలం శాంభవి 2027 CE, అంటార్కిటికా ఆఫ్రికా, ఉగ్రభట్టి కేవల్, లంక- త్రేతాయుగం, వారణాసి మణికర్ణిక ఘాట్ వంటి అనేక ప్రాంతాలతోపాటు యుగాలు చూపించారు. ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా విజువల్స్ తోనే మేకర్స్ ఫిదా చేశారు. మహేష్ బాబు ఎంట్రీతో అందరినీ వావ్ అనిపించారు.

అయితే వారణాసి గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. ఇప్పుడు దాని వ్యూస్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్స్ లో కలిపి 20 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. మెయిన్ టీ సిరీస్ ఛానల్ లో 15 మిలియన్ల వ్యూస్ ను వారణాసి గ్లింప్స్ ను సాధించింది.

టీ సిరీస్ తెలుగులో 1.7 మిలియన్ల వ్యూస్ రాగా, టీ సిరీస్ మలయాళంలో 200 కే, టీ సిరీస్ తమిళ్ లో 600 కె వ్యూస్ వచ్చాయి. దీంతో మొత్తం కౌంట్ అనుకున్న రేంజ్ లో లేదని కొందరు నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. షాకింగ్ గా ఉన్నాయని అంటున్నారు. మరికొందరు.. ఇవి ఒరిజినల్ వ్యూస్ అని ఆన్సర్ ఇస్తున్నారు.

అనేక సినిమాల కోసం వ్యూస్, లైక్స్ ను ఆయా మేకర్స్ ఎప్పటికప్పుడు కొంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి అండ్ టీమ్ మాత్రం అలాంటి పని చేయలేదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జెన్యూన్ వ్యూస్ వచ్చాయని, ఎలాంటి షాకింగ్ కాదని అంటున్నారు. రాజమౌళి ఎప్పుడూ ఫేక్ లెక్కలకు ప్రాధాన్యమివ్వరని, కేవలం అసలైన మార్కెటింగ్ పై ఫోకస్ చేస్తారని కామెంట్లు పెడుతున్నారు.



Full View


Tags:    

Similar News