• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైష్ణవ్ తేజ్- రీతువ‌ర్మ...

వైష్ణవ్ తేజ్- రీతువ‌ర్మ ల‌వ్వాయ‌ణం నిజ‌మా?

| చివ‌రివ‌ర‌కూ దాగుడుమూతలు ఆడేస్తూ వ్య‌వ‌హారాన్ని న‌డిపించేస్తున్నారు నేటిత‌రం తార‌లు.

By - Tupaki Desk
Update: 2023-11-18 16:10 GMT

త‌మ మ‌ధ్య ఏమీ లేదు అంటూనే చివ‌రికి పెళ్లి శుభ‌లేఖ అచ్చేయిస్తున్నారు యువ‌జంట‌లు. అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ.. కాజ‌ల్ - గౌత‌మ్ కిచ్లు.. నుంచి, మొన్న పెళ్ల‌యిన వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వ‌రకూ ప్రేమాయ‌ణాలు అన్నీ ఇదే బాప‌తు. స‌డెన్ గా నిశ్చితార్థం - పెళ్లి అంటూ ట్విస్టిచ్చిన‌వారే వీరంతా. చివ‌రివ‌ర‌కూ దాగుడుమూతలు ఆడేస్తూ వ్య‌వ‌హారాన్ని న‌డిపించేస్తున్నారు నేటిత‌రం తార‌లు.

అందుకే ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్- రీతూ వ‌ర్మ జంటపై పుకార్లు ఆగ‌డం లేదు. వైష్ణ‌వ్ తేజ్ చెబుతున్న‌ది కూడా ఎవరూ విన‌డం లేదు. ఈ జంట‌ కూడా ఇదే బాప‌తు అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. చాలా కాలంగా ఈ జంట‌ గుట్టుగా ప్రేమాయ‌ణం సాగిస్తున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి జంట‌తో పోలుస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్ష‌సి లావణ్య త్రిపాఠి జంట వివాహం ఇటీవల ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ప్రీవెడ్డింగ్ వేడుకల్లో వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు యువ‌క‌థానాయిక రీతూ వర్మ కూడా పాల్గొన్నారు. పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీలో రీతూ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ఆ కుటుంబానికి చెందిన ఓ హీరోతో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.

ఇప్పుడు `ఆదికేశవ` సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న వైష్ణ‌వ్ తేజ్ ఆయా కథనాలపై స్పందించారు. వరుణ్-లావణ్యల వివాహ వేడుకలో రీతూ వర్మ పాల్గొనడానికి గల కారణం వెల్లడించారు. లావణ్య త్రిపాఠికి రీతూ మంచి స్నేహితురాలని.. అందుకే పెళ్లి వేడుకలో సందడి చేసింద‌ని అత‌డు తెలిపాడు. అంతకు మించి ఏమీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదే ఇంట‌ర్వ్యూలో వైష్ణ‌వ్ తేజ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ముచ్చ‌టించాడు. త‌న‌ మావ‌య్య‌లు నటించిన ఖైదీ-బద్రి సినిమాల రీమేక్‌లో నటించాలనుకుంటున్నట్లు చెప్పారు

ఇక సినిమాల విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ఆదికేశవ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇది అతనికి 4వ సినిమా. ఇందులో రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా వైష్ణ‌వ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. శ్రీలీల కథానాయిక. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది.

Tags:    
  • Vaishnavtej 
  • Rithuvarma 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS