50 ఏళ్ల నటుడితో 30 ఏళ్ల నటి ఇంటిమేట్ సీన్స్!
వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేదు. నచ్చిన కథను నచ్చినట్లు తీసుకొచ్చు. ఎలాంటి సన్నివేశాలకైనా అభ్యంతరముండదు. ఎంతో స్వేచ్ఛగా పనిచేసుకునే వెసులు బాటు వెబ్ సిరీస్ లు మేకర్స్ కు కల్పిస్తున్నాయి.;
వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేదు. నచ్చిన కథను నచ్చినట్లు తీసుకొచ్చు. ఎలాంటి సన్నివేశాలకైనా అభ్యంతరముండదు. ఎంతో స్వేచ్ఛగా పనిచేసుకునే వెసులు బాటు వెబ్ సిరీస్ లు మేకర్స్ కు కల్పిస్తున్నాయి. దీం తో రొమాన్స్ అంటే అనాసక్తి చూపించే వారు కూడా ఇప్పుడెంతో ఆసక్తి చూపి స్తున్నారు. రకరకాల డాక్యు మెంటరీ..సిరీస్ ల్లో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
ఓటీటీలో కొన్ని రకాల సిరీస్ లు చూడలంటే ? ఫ్యామిలీ తో కలిసి కూర్చుని పరిస్థితి లేదు. ముఖ్యంగా బాలీవుడ్ కంటెంట్ లో అశ్లీలత ఎక్కువ కనిపిస్తుంది. అలాగని మిగతా భాషలు తక్కువ కాదు. 'రానా నాయుడు'లో దగ్గుబాటి ప్యామిలీ హీరోలు చేసిన రచ్చ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. తాజాగా కోలీవుడ్ లో 'వదంతి 2' క్రైమ్ థ్రిల్లర్ కు రంగం సిద్దమవుతుంది.
ఇందులో శశికుమార్ హీరోగా, అపర్ణాదాస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ మధురై, తిరునల్వేలి ప్రాంతాల్లో షూటింగ్ జరుతుంది. సీజన్ వన్ లో ఎలాంటి రొమాన్స్ కి ఛాన్స్ తీసుకోని హీరో సీజన్ 2లో చెలరేగుతున్నట్లు తెలుస్తోంది. శశికుమార్-అపర్ణదాస్ ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తున్నారుట. అలాగే ఘాడమైన పెదవి ముద్దుల్లోనూ ఏమాత్రం తగ్గలేదుట. ప్రస్తుతం తిరునల్వేలి ప్రాంతంలో వాటికి సంబంధించిన సన్నివేశాలే చిత్రీకరిస్తున్నారుట.
అయితే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా భారీగా ఉంది. శశికుమార్ వయసు 50 కాగా, అపర్ణాదాస్ వయసు 30. దీంతో ఇద్దరి మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు? ఏంటి అనే వ్యతిరేకత కూడా మొదలైంది నెట్టింట. ఇటీవల రిలీజ్ అయిన థగ్ లైఫ్ లో కమల్ హాసన్ -అభిరామి లిప్ లాక్ పై ఇలాంటి చర్చే జరిగిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల వయసున్న నటుడితో 40 ఏళ్ల నటి లిప్ లాక్ ఏంటనే విమర్శ వ్య క్తమైంది. దీనికి అభిమారి ధీటుగా కందకు లేని దురద కత్తికి ఎందుకున్నట్లు సమాధానం ఇచ్చారు.