• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కల్కి' కోసం సెంటిమెంట్...

'కల్కి' కోసం సెంటిమెంట్ డేట్?

| ఐతే సినిమా ఎప్పటికి రెడీ అవుతుందనే అంచనాను బట్టి ఒక స్పెషల్ డేట్‌ను 'కల్కి' కోసం చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

By - Tupaki Desk
Update: 2023-08-12 10:47 GMT

ప్రభాస్ కొత్త చిత్రం 'కల్కి 2898 ఏడీ'ని ముందు వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ భారీ చిత్రాన్ని ఆ సమయానికి రెడీ చేయడం అసాధ్యమనే అంటున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగే పూర్తి కాలేదు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ ఈ సినిమాను సంక్రాంతి కల్లా సిద్ధం చేసి బహు భాషల్లో రిలీజ్ చేయడం అంటే శక్తికి మించిన పనే. ఈ విషయంలో చిత్ర బృందం కూడా ఒక క్లారిటీకి వచ్చేసినట్లు కనిపిస్తోంది.

సినిమాను సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదన్న మాటే కానీ.. ఇండస్ట్రీ వర్గాలకు అయితే ఈ మేరకు క్లారిటీ వచ్చేసింది. అందుకే వేరే సినిమాలు రేసులోకి వచ్చాయి. సంక్రాంతి కాదంటే 'కల్కి' ఇంకెప్పుడు వస్తుందనే ఉత్కంఠ ప్రభాస్ అభిమానులను వెంటాడుతోంది. షూట్ పూర్తయ్యాక ఒక క్లారిటీ తెచ్చుకుని డేట్ ప్రకటిస్తామంటూ ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఐతే సినిమా ఎప్పటికి రెడీ అవుతుందనే అంచనాను బట్టి ఒక స్పెషల్ డేట్‌ను 'కల్కి' కోసం చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ డేట్ మే 9 కావడం విశేషం. ఈ తేదీ వైజయంతీ సంస్థకు చాలా ప్రత్యేకం. ఇదే రోజు ఆ సంస్థ నుంచి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి ఆల్ టైం హిట్ వచ్చింది. ఇక వైజయంతీ వారి ప్రతిష్టను మళ్లీ నిలబెట్టిన 'మహానటి' సైతం అదే రోజు విడుదలైంది.

వైజయంతీ సంస్థతో పాటు నాగ్ అశ్విన్‌కు సెంటిమెంటుగా బాగా కలిసొచ్చిన ఈ తేదీనే 'కల్కి'ని రిలీజ్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందని భావిస్తున్నారట. ఇలాంటి భారీ చిత్రానికి సంక్రాంతి మిస్సయిందంటే తర్వాత కనిపించే బెస్ట్ ఆప్షన్ సమ్మరే. సినిమా అప్పటికి రెడీ అయ్యేట్లుంటే మాత్రం ఈ డేట్ ఫిక్స్ కావచ్చు. లేదంటే 2024 దసరా వైపు చూడొచ్చు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    
  • Prabhas 
  • Nagashwin 
  • Vyjayanthimovies 
  • Ashwindutt 
  • Deepikapadukone 
  • Kalki 
  • Kalkimovie 
  • Kalkifilm 
  • Kamalhassan 
  • Amitabhbachchan 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS