బన్నీ ఫ్యామిలీ 'కనిపించలేదా' ?
ఇక్కడే అసలు మిస్టరీ స్టార్ట్ అయింది. ఒకవేళ వాళ్లు నిజంగానే వచ్చి ఉంటే, అఫీషియల్‌గా రిలీజ్ చేసిన ఫైనల్ ఎడిటెడ్ వీడియోలో వాళ్ల ఫుటేజ్ ఎందుకు లేదు?;
రీసెంట్‌గా రిలీజైన ఉపాసన సీమంతం వీడియో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. మొదటిసారి మెగా ట్రీలో కవలలు రానున్నట్లు చెప్పడంతో మరింత కిక్ ఇచ్చింది. దీంతో చాలా గ్రాండ్‌గా సీమంత వేడుక జరిగింది. ఇక, అంతే అందంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కనిపించడంతో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు, అందరూ చాలా హ్యాపీగా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, ఈ హ్యాపీ మూమెంట్స్ మధ్యలోనే ఒక చిన్న 'క్వశ్చన్ మార్క్' సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది. ఇంత పెద్ద ఫ్యామిలీ ఈవెంట్‌లో, మెగా ఫ్యామిలీలో అంతర్భాగమైన అల్లు ఫ్యామిలీ ఎక్కడా కనిపించకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, పిల్లలు.. ఎవరి విజువల్స్ ఆ వీడియోలో లేవు.
ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్స్ జరిగితే అందులో అల్లు వారి హడావుడి మాములుగా ఉండదని చెప్పవచ్చు. కానీ వాళ్ళు వీడియోలో కనిపించలేదు. దీంతో, అసలు అల్లు ఫ్యామిలీ ఈ ఫంక్షన్‌కు రాలేదా? లేక వచ్చినా వీడియోలో కనిపించలేదా? అనే గాసిప్ మొదలైంది. కొంతమంది "ఏమో, వాళ్లు వచ్చి ఉండరులే" అని లైట్ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో మరో 'ఇన్‌సైడ్ టాక్' గట్టిగా వినిపిస్తోంది. దాని ప్రకారం, అల్లు ఫ్యామిలీ మొత్తం ఆ ఫంక్షన్‌కు అటెండ్ అయ్యారట.
ఇక్కడే అసలు మిస్టరీ స్టార్ట్ అయింది. ఒకవేళ వాళ్లు నిజంగానే వచ్చి ఉంటే, అఫీషియల్‌గా రిలీజ్ చేసిన ఫైనల్ ఎడిటెడ్ వీడియోలో వాళ్ల ఫుటేజ్ ఎందుకు లేదు? అనుకోకుండా మిస్ అయిందా? అనేది ఇప్పుడు పెద్ద పజిల్ అయిపోయింది. ఈ విషయంపై క్లోజ్ సర్కిల్స్‌లో కూడా క్లారిటీ లేదని, వాళ్లు కూడా ఈ 'మిస్సింగ్' విజువల్స్ చూసి షాక్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ 'మిస్టరీ' ఇప్పుడు ఫ్యాన్ గ్రూపుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ అయి ఉంటుందా, లేక దీని వెనుక వేరే కథేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి, ఈ చిన్న 'మిస్సింగ్ పీస్' ఇప్పుడు అనవసరమైన ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, ఇదంతా కేవలం వీడియోను చూసి, వినిపిస్తున్న గాసిప్స్ ఆధారంగా జరుగుతున్న చర్చ మాత్రమే. అసలు కారణం ఏంటో ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెబితే కానీ తెలియదు.