ఆ రోజు పెద్ద యుద్ధాలే జరుగుతాయి
తెలుగమ్మాయి అయిన ఉదయభాను ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలోని అవకాశాలపై ఆమె రీసెంట్ గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.;
తెలుగమ్మాయి అయిన ఉదయభాను ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలోని అవకాశాలపై ఆమె రీసెంట్ గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని చెప్పిన ఉదయభాను ఆమె నటించిన తాజా సినిమా త్రిబాణధారి బార్భరిక్ ప్రమోషన్స్ లో భాగంగా దానిపై మరోసారి మాట్లాడారు.
ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఉదయభాను ఇండస్ట్రీలో యాంకర్లు సిండికేట్ గా ఏర్పడ్డారని అనగా, ఉదయభానుకు సరైన అవకాశాలు లేకనే అలా అన్నారని కొందరంటే, కావాలని ఏదొకటి అనాలని అనిందని మరికొందరన్నారు. అయితే ఆరోజు తాను ఆ విషయాన్ని చాలా జోక్ గా అన్నానని, కానీ తాను చెప్పిన విషయం మాత్రం నిజమేనని తేల్చి చెప్పారు.
డేట్స్ తీసుకుని తర్వాత వద్దనేవారు
ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయని, తనను తొక్కేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారని, కొన్నిసార్లు మొత్తం రెడీ అయిపోయి ఈవెంట్ కు వెళ్లాక ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిందని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఉదయభాను షో చేస్తుదంటే ఆమెను ఎందుకు తీసుకున్నారనే వాళ్లే ఎక్కువని, డేట్స్ తీసుకుని కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తనను తీసేసేవాళ్లని ఆమె తెలిపారు.
మొదటి నుంచి సెలెక్టివ్‌గానే..
కెరీర్లో ఎన్నో బాధలు పడ్డానని చెప్పిన ఉదయభాను, తను మొదటినుంచి చాలా సెలెక్టివ్ గా ఉండేదాన్నని, ఛాన్స్ వచ్చినా ఏది పడితే అది చేయనని, చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తే తనకంటే చిన్న యాంకర్లకు ఛాన్సులు రావని, వాటి జోలికి వెళ్లనని, వారి ఆకలిని కొట్టేయాలని ఎప్పుడూ అనుకోనని చెప్పారు. హయ్యెస్ట్ పెయిడ్ యాంకర్ అని ముద్ర వేశారు కానీ తన ఇంటికొచ్చి చూస్తే తన వద్ద ఎన్ని బౌన్డ్స్ చెక్కులున్నాయో తెలుస్తోందని ఆమె అన్నారు.
ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నింటినీ త్వరలో బయటపెడతానని, ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయని, తనకు జరిగిన ప్రతీ అన్యాయాన్నీ అందరికీ తెలియచేస్తానని, దాని వల్ల తర్వాతి తరాల వారికి ఇండస్ట్రీలో ఉండే సమస్యల గురించి అవగాహన పెరుగుతుందని అన్నారు. తన మాటల్లో ఉండే ఫిలాసఫీ బుక్స్ చదవడం వల్ల వచ్చిందని, కానీ కెరీర్ నేర్పిన ఫిలాసఫీతో తాను ప్రస్తుతం ఓ బుక్ రాస్తున్నట్టు వెల్లడించారు.