• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రూ లవర్స్ ట్రైలర్.....

ట్రూ లవర్స్ ట్రైలర్.. వాలంటైన్స్ వీక్ కు సరైన ట్రీట్!

| గతేడాది ఓటీటీ ప్లాట్‌ ఫాం హాట్‌ స్టార్‌ లో రిలీజైన తమిళ డబ్బింగ్ మూవీ గుడ్‌ నైట్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-02-04 15:32 GMT

గతేడాది ఓటీటీ ప్లాట్‌ ఫాం హాట్‌ స్టార్‌ లో రిలీజైన తమిళ డబ్బింగ్ మూవీ గుడ్‌ నైట్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో కోలీవుడ్‌ నటుడు మణికందన్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ హీరోనే నటించిన లేటెస్ట్‌ మూవీ లవర్‌. తెలుగులో ట్రూ లవర్‌ పేరుతో రిలీజ్‌ అవుతుంది. గుడ్‌ నైట్‌ మేకర్స్‌, సేమ్ బ్యానర్లో మణికందన్‌ హీరోగా నటిస్తున్న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్.. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్‌ క్రియేట్‌ చేసుకుంది.

మాస్‌ మూవీ మేకర్స్‌, మారుతి టీం ప్రొడక్షన్‌ పై స్టార్‌ డైరెక్టర్‌ మారుతి, సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌ ఎస్కేఎన్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మణికందన్‌ జోడీగా గౌరీప్రియ హీరోయిన్‌ గా నటిస్తుంది. రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోలీవుడ్‌ కు పరిచయం కాబోతోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ ను గమనిస్తే.. ప్రతి ప్రేమ జంట బయట ఎలా ఉంటారో సినిమాలో జంట కూడా అలాగే కనిపించారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ట్రైలర్ అనిపించింది. ఆరేళ్ల ప్రేమ.. ఎన్నో గొడవలు.. అయినా కలిసి ఉండాలనుకునే ఓ యువకుడు. డబ్బు ఉన్న ఓ అమ్మాయి.. పెళ్లికి మాత్రం టైం అడుగుతూ ఉంటుంది. డబ్బు లేకపోతే తనకు విలువ లేదని హీరో బాధపడతాడు. డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ.. ప్రేమను దూరం చేసుకున్న అబ్బాయి చివరికి తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనేది ట్రూ లవర్ సినిమా కథ.

చదువు, ఉద్యోగం, ప్రేమ, డబ్బు.. ఒక అబ్బాయి జీవితంలో ఎందుకు ముఖ్యమో చూపించే మంచి ప్రయత్నం చేశారు డైరెక్టర్. డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. సీన్ రోల్డాన్ అందించిన మ్యూజిక్.. ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలిచింది. ఇక రాబోయే వాలంటైన్స్ వీక్‌ కు ఈ మూవీ సరైన ట్రీట్‌ అని సినీ పండితులు చెబుతున్నారు.

ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ మూవీకి తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీం ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

తమిళంలో ఫిబ్రవరి 9న, తెలుగులో ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌ కాబోతోంది. బేబీలో ఉన్న అన్ని లవ్‌ అండ్‌ ఎమోషన్ ఎలిమెంట్స్.. ట్రూ లవర్‌ లోనూ కనిపిస్తున్నాయి. కాబట్టి బేబీ లాగా ఈ మూవీ కూడా యూత్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. నిర్మాతగా ఎస్కేఎన్ మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు నెటిజన్లు. మరేం జరుగుతుందో చూడాలి.

Full View
Tags:    
  • Truelover 
  • Trailertalk 
  • Tollywood 
  • Movienews 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS