• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ సినిమా...

త్రివిక్రమ్ సినిమా పాఠాలు.. వీడియో వైరల్.

| వివరాళ్లోకి వెళితే.. త్రివిక్రమ్ దర్శకుడు కాకముందు పలు చిత్రాలకు రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-10-02 06:35 GMT

ఫిల్మ్​ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​కు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. ఆయన కలంలో కాస్త చిలిపిదనం, కాస్త వెటకారం, ఇంకాస్త గాంభీర్యం కనపడుతుందని చెప్పాలి. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో మనల్ని ఆలోచింపజేసేలా చేస్తుంది. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన చాలా ఏళ్ల క్రితంది ఓ పాత వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో మాటల మాంత్రికుడు ఓ సూపర్ హిట్ సినిమా స్క్రీన్​ ప్లేను వివరిస్తూ కనిపించారు.

వివరాళ్లోకి వెళితే.. త్రివిక్రమ్ దర్శకుడు కాకముందు పలు చిత్రాలకు రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే. కథ అందించడం, డైలాగ్స్​ రాయడం వంటివి చేసేవారు. అలాగే స్క్రీన్​ ప్లే కూడా అందించారు. ఆయన కథలు అందించిన సినిమాలన్నీ సూపర్ హిట్​గా నిలిచాయి. కేవలం చిన్న చిన్న సంభాషణలు, మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే రచనా శైలి ఆయనది.

ఆయన స్టేజ్‌ ఎక్కితే బలమైన, బరువైన మాటలను చెప్పే వెళ్తారు. అందుకే ఆయన చెప్పిన మాటలు, లేద ఆయనకు సంబంధించిన ఇతర విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్‌ అవుతునే ఉంటాయి. తాజాగా ఆయన ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో.. చాలా కాలం క్రితంది సోషల్​ మీడియాలో దర్శనమైంది. ఇందులో త్రివిక్రమ్​.. సూపర్ హిట్​ బాలీవుడ్ చిత్రం ఆమిర్ ఖాన్ నటించిన రంగ్​ దే బసంతి సినిమా స్క్రీన్​ ప్లే గురించి వివరిస్తూ కనిపించారు.

ఓ గదిలో చాలా మంది కూర్చిల్లో కూర్చొని ఉండగా.. వారందరికీ బోర్డుపై సినిమా స్క్రీన్​ ప్లే గురించి, సినిమాలోని స్ననివేశాల గురించి స్పష్టంగా వివరించారు. అసలు ఏ సన్నివేశం ఎందుకు పెట్టారు, ఏ డైలాగ్​ ఎందుకు వాడారు, ఫలానా చోటే సదరు సన్నివేశాన్ని ఎందుకు తీశారు.. ఇలా చాలా చెబుతూ కనిపించారు. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్తిస్తోంది. ఇందులో త్రివిక్రమ్ లుక్​ కూడా చాలా సింపుల్​గా ఉంది. కాస్త లైట్​ గడ్డంతో తెల్ల చొక్కా ధరించి కనిపించారు.

ఇకపోతే త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్​బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

Old video of Legend #Trivikram breaking down the screenplay of Rang De Basanti 🙏 pic.twitter.com/9fJ0p5EDMM

— Actual India (@ActualIndia) October 1, 2023
Tags:    
  • Trivikramsrinivas 
  • Rangdebasanti 
  • Trivikram 
  • Filmindustry 
  • Maheshbabu 
  • Gunturkaaram 
  • Filmmaker 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS