దీపికకి అండగా త్రిప్తి.. అసలేం జరుగుతోంది?

ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒకరికొకరు మద్దతు ఇచ్చేవారు కాదు అని అనుమానాలు ఫ్యాన్స్ వ్యక్తం అయ్యేవి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే.. హీరోయిన్స్ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.;

Update: 2025-10-07 06:52 GMT

ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒకరికొకరు మద్దతు ఇచ్చేవారు కాదు అని అనుమానాలు ఫ్యాన్స్ వ్యక్తం అయ్యేవి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే.. హీరోయిన్స్ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన ముంబై ఈవెంట్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏకంగా యంగ్ హీరోయిన్స్ తో చక్కగా కలిసిపోయి.. వారి క్రేజ్ కు దోహదపడిన విషయం తెలిసిందే. మరి కొంతమంది.. తోటి హీరోయిన్స్ కి ఏదైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా దీపికకు ఇండస్ట్రీలో వ్యతిరేకత వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు త్రిప్తి డిమ్రి ఆమెకు సపోర్ట్ చేయడం వైరల్ గా మారుతోంది. దీంతో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'యానిమల్' సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనేను ఎంపిక చేసుకున్నారు. కానీ పని గంటలు, రెమ్యూనరేషన్ విషయంలో కాస్త విభేదాలు ఏర్పడడంతో దీపికాను తొలగించి ఆస్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. దీంతో అప్పటినుంచి దీపికా పదుకొనే - త్రిప్తి డిమ్రి ల మధ్య పడడం లేదు అంటూ వార్తలు రాగా.. సడన్ గా తృప్తి డిమ్రి చేసిన పనికి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ఒక యూజర్ సినిమాలో దీపిక అంకితభావాన్ని తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు. రామ్ లీలా సినిమాలో ఒక పాట కోసం దీపిక చాలా కష్టపడ్డారని.. 30 కేజీల బరువు ఉన్న లెహంగాను ధరించి డాన్స్ చేయడమే కాకుండా తన కాళ్లకు రక్తం వస్తున్నా.. ఆపకుండా నృత్యం చేశారని, ఆమె డెడికేషన్ కి ఎవరైనా ఫిదా అవుతారు అంటూ సదరు యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఇది కాస్త వైరల్ అవ్వడంతో ఈ పోస్టును త్రిప్తి లైక్ చేశారు. దీంతో దీపికాకు త్రిప్తి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అంటూ దీపిక అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా స్పిరిట్ మూవీ నుండి దీపికాను తొలగించి త్రిప్తిని తీసుకున్నారు అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య మాటలు లేవు అంటూ వచ్చిన వార్తలకు త్రిప్తి ఒక్క లైక్ తో చెక్ పెట్టింది అని చెప్పవచ్చు.

సినిమా విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరగబోతున్నట్లు సమాచారం. యానిమల్ తో ఓవర్ నైట్ లోనే పాపులర్ సంపాదించుకున్న త్రిప్తి ఈ సినిమాతో మరెలాంటి సక్సెస్ దక్కించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News