టోవినోకి ఎప్ స్టీన్ ఫైల్స్.. ఇలాంటివి అవసరమా?
అయితే ఇప్పుడు టోవినో అప్ కమింగ్ మూవీ అతిరడి ప్రమోషన్స్ లో వరల్డ్ పాలిటిక్స్ తో పాటు పలు విషయాలపై చర్చ కొనసాగింది.;
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ ప్రస్తుతం తన లేటెస్ట్ యాక్షన్ కామెడీ మూవీ అతిరడి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే తాజాగా టోవినోకు ఎదురైన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఎప్ స్టీన్ ఫైల్స్ లో మీ పేరు ఉందా? అంటూ అడిగిన ప్రశ్నపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
నిజానికి.. టోవినో థామస్ మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. మిన్నల్ మురళి, మాయానది, వైరస్, లూసిఫర్, ఫోరెన్సిక్, 2018 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో డబ్ అయిన సినిమాల ద్వారా కూడా ఆయనకు ఇక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇటీవల వచ్చిన పళ్లి చట్టంబి చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు టోవినో అప్ కమింగ్ మూవీ అతిరడి ప్రమోషన్స్ లో వరల్డ్ పాలిటిక్స్ తో పాటు పలు విషయాలపై చర్చ కొనసాగింది. అదే సమయంలో అమెరికాలో మరోసారి హాట్ టాపిక్ గా మారిన ఎప్ స్టీన్ ఫైల్స్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ క్రమంలోనే టోవినోను ఉద్దేశించి ఆ జాబితాలో మీ పేరు ఉందా? అంటూ ప్రశ్న అడిగినట్టు సోషల్ మీడియాలో వీడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ ప్రశ్నకు టోవినో థామస్ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తోంది. అయితే పక్కనే ఉన్న దర్శకుడు బాసిల్ నవ్విన తీరు కూడా కొంతమందికి ఇబ్బందిగా అనిపించింది. ఒక నటుడిని ఇలా ఆధారాలు లేకుండా వివాదాస్పద అంశంతో కలిపి ప్రశ్నించడం సరైనది కాదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రమోషన్స్ కోసం సినిమాకు సంబంధం లేని అంశాలను లాగడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కొంతమంది మాత్రం ఇది సరదాగా అడిగిన ప్రశ్న కావచ్చని, దాన్ని అతిగా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక ఇంటర్నేషనల్ సె* క్స్ ట్రాఫికింగ్ కేసుతో సంబంధం ఉన్న ఎప్ స్టీన్ ఫైల్స్ వంటి సెన్సిటివ్ ఇష్యూను ఇండియన్ యాక్టర్ తో లింక్ చేస్తూ ప్రశ్నించడం సరైంది కాదనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అయితే అమెరికాకు చెందిన ఎప్ స్టీన్ పై వచ్చిన సె* క్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఆ కేసుకు సంబంధించిన పలు పత్రాలు, ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో మళ్లీ ఆ అంశం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపారవేత్తలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల పేర్లు చర్చలోకి రావడం మరింత ఆసక్తి రేకెత్తించింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి లిస్ట్, ప్రతి వార్త నిజమనే గ్యారెంటీ లేదని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సెలబ్రిటీలకు పిచ్చి ప్రశ్నలు వేయడం, వాటిని వైరల్ చేయడం వల్ల వారి ఇమేజ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.