ఆ డైరెక్టర్ వైఫల్యం కోసం ఎదురు చూస్తోన్న అసూయ గ్యాంగ్!
టాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగి, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఓ స్టార్ డైరెక్టర్.
టాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగి, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఓ స్టార్ డైరెక్టర్. ఆయన ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా నిర్మాతలకు లాభాల పంట పండిస్తుంటుంది. అయితే ఇండస్ట్రీలో ఎదిగే కొద్దీ అందరి మన్ననలు అందుకోవడం ఎంత కష్టమో? అదే స్థాయిలో శత్రువులను మూటగట్టుకోవడం కూడా అంతే సహజం. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సరికొత్త చర్చ ప్రకారం ఆ స్టార్ డైరెక్టర్ ఘోరమైన పరాజయాన్ని చవిచూడాలని ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గ్యాంగ్ ఎదురు చూస్తోందట.
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు ఈ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఎవరికైనా బ్యాడ్ టైమ్ వస్తేనే కదా తమకు మళ్ళీ ఛాన్సులు వస్తాయని భావించే కొంతమంది స్వార్థపరులు, ఆ డైరెక్టర్ సినిమా ఎప్పుడు బెడిసికొడుతుందా? గోతు కాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారుట. బయటకు నటిస్తూనే, లోపల మాత్రం ఆయన వైఫల్యాన్ని కోరుకునే ఈ నెగిటివ్ గ్యాంగ్ తీరు టాలీవుడ్ ఇన్‌సైడర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ డైరెక్టర్ సినిమాలంటేనే వినోదం, కమర్షియల్ హంగులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే మ్యాజిక్ ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలతోనే కాకుండా ఎలాంటి అంచనాలు లేని సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. అయితే ఈ రేంజ్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు ఒక్కసారి కిందపడితే చూడాలని కొందరు ఈర్ష్యతో రగిలిపోతున్నారు. ఆయన ఏ చిన్న తప్పు చేసినా దానిని పెద్దది చేసి చూపించడానికి గ్యాంగ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీ అనేది విజయాలకే పట్టం కడుతుంది. ఒకసారి పరాజయం వస్తే చాలు చుట్టూ ఉన్నవారే దూరమవుతారనే నానుడి ఉంది. కానీ ఆ డైరెక్టర్ విషయంలో మాత్రం పరాజయం కోసం కొందరు ఎదురు చూడటం అనేది అతడి సక్సెస్ స్థాయికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే ప్రజల్లో విశేష ఆదరణ ఉంటుందో? ఎవరైతే బాక్సాఫీస్‌ను శాసిస్తుంటారో? వారిపైనే ఇలాంటి వ్యతిరేక శక్తులు ఎక్కువగా ప్రభావం చూపాలని చూస్తుంటాయి.
అయితే ఇవన్నీ పట్టించుకోకుండా ఆ డైరెక్టర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు. ఏ మాత్రం వివాదాలకు తావునివ్వకుండా కేవలం తన సినిమాల ప్రమోషన్స్ .. కంటెంట్ మీదే ఆయన పూర్తి దృష్టి పెడుతుంటారు. సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఆడియన్స్ ఆయనను ఎంతగా నమ్ముతున్నారో ? బాక్సాఫీస్ కలెక్షన్లే నిరూపిస్తున్నాయి.
మొత్తానికి ఇండస్ట్రీలో ఎంతటి ప్రతిభ చూపించినా కొందరి అసూయను ఎదుర్కోవడం తప్పదని ఆ డైరెక్టర్ ఉదం తం మరోసారి రుజువు చేస్తోంది. ఎన్ని కుట్రలు పన్నినా? ఆయన రాసుకునే కథలు , ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం ఎలాంటి నెగిటివ్ గ్యాంగ్‌లు కూడా ఆయన విజయాన్ని ఆపలేవు. ఈ విమర్శలన్నింటికీ తదుపరి సినిమాల బ్లాక్‌బస్టర్ హిట్లతోనే సమాధానం చెబుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరిగా త్రివిక్రమ్ చెప్పినట్లు ట్యాలెంట్ ఉన్నో డు విషయంలో వాళ్లని చూసి చప్పట్లు కొడితే చాలు...మనం పెద్దగా చేయాల్సింది ఏదీ ఉండదు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతూనే ఉంటారన్నారు. ఆ డైరెక్టర్ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది.