వేసవి ఉష్ణోగ్రతలను మించిపోతున్న టాలీవుడ్ వేడి!

టాలీవుడ్ సరికొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. భానుడి భగభగలకు ఇళ్లకే పరిమితం కాకుండా? టాలీవుడ్ అగ్ర తారలంతా ప్రతిష్టాత్మక చిత్రాలను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు నడుం బిగించారు.

Update: 2026-05-22 08:14 GMT

టాలీవుడ్ సరికొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. భానుడి భగభగలకు ఇళ్లకే పరిమితం కాకుండా? టాలీవుడ్ అగ్ర తారలంతా ప్రతిష్టాత్మక చిత్రాలను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు నడుం బిగించారు. వేసవి సెలవులు కూడా కాదనుకుని మండుతోన్న ఎండల్లోనే సరికొత్త షెడ్యూళ్లతో సెట్స్‌పై చెమటోడుస్తున్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సరికొత్త కథలతో తెలుగు సినిమా సరిహద్దులను దాటేందుకు సిద్ధ మవుతోంది. ఈ శ్రమలో ముందు వరుసలో నిలిచారు సూపర్ స్టార్ మహేష్ .రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `వారణాసి`తాజా షెడ్యూల్ వారణాసి పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతోంది.

మండుటెండల్లో కూడా చిత్ర యూనిట్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలోని కీలకమైన సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. మ‌రోవైపు కింగ్ నాగార్జున నటిస్తున్న 100వ ల్యాండ్‌మార్క్ చిత్రం `కింగ్ 100` షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలో శరవేగంగా జరుగుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో నాగార్జున బిజీగా గడుపుతున్నారు. అలాగే మాస్ మహారాజా రవితేజ సైతం ఏమాత్రం విరామం లేకుండా `ఇరు ముడి` కోసం రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఓ భారీ జాతర సీక్వెన్స్‌ను నిర్మిస్తోంది. భారీ జ‌న సందోహం మధ్య వేసవి ఉక్కపోతలో కూడా రవితేజ తనదైన ఎనర్జీతో మాస్ ఎపిసోడ్‌ను పూర్తి చేస్తున్నారు.

అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ -పవర్‌ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `స్పిరిట్` చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రానికి సంబంధించి హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోంది. కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ ఎండను సైతం లెక్కచేయకుండా డూప్ లేకుండా ప‌ని చేస్తున్నారు. ఇదే తరుణంలో విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కలయికలో తెర‌కెక్కుతోన్న `ఆద‌ర్శ‌కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47` షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది.

కీలక నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సైతం తదుపరి షెడ్యూల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం కొత్త షెడ్యూల్ వచ్చే నెల నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ `పెద్ది` తో బ్లాస్ట్ అవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే టాలీవుడ్‌లో? ఎక్కడా మందగమనం కానీ విరామం కానీ కనిపించడం లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి స్టార్ హీరో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాబోయే రెండేళ్లలో థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన వినోదాల విందు పంచడమే లక్ష్యంగా హీరోలంతా రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News