స‌త్య‌పై పాట‌.. అదీ అత‌ని క్రేజ్

స‌త్య న‌టించిన ప్రతీ సినిమాలోనూ త‌నదైన కామెడీ టైమింగ్ తో ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమా నుంచి స‌త్య క్రేజ్ మ‌రింత పెరిగింది.;

Update: 2026-01-07 15:27 GMT

సినిమాలంటే కేవ‌లం హీరోల‌పైనే డిపెండ్ అయి ఆడ‌వు. ఒక్కోసారి ఒక్కో కార‌ణంతో సినిమాలు హిట్ట‌వుతూ ఉంటాయి. కొన్నిసార్లు హీరో క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ల్ల సినిమాలు ఆడితే, మ‌రికొన్ని సార్లు సినిమాలోని క‌థ వ‌ల్లనో, డైరెక్ష‌న్ వ‌ల్ల‌నో, స్క్రీన్‌ప్లే వ‌ల్ల‌నో ఆడుతుంటుంది. మ‌రికొన్ని సార్లైతే సినిమాలోని కామెడీ, అందులో న‌టించే క‌మెడియ‌న్ వ‌ల్ల సినిమాలు ఆడుతుంటాయి.

టాలీవుడ్ లో అలా కామెడీ వ‌ల్లే ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక‌ప్పుడు కోటా శ్రీనివాస‌రావు, రాజేంద్ర‌ప్రసాద్, బ్ర‌హ్మానందం, సునీల్ కామెడీ వ‌ల్ల సినిమాలు తెగ ఆడేవి. త‌ర్వాత వెన్నెల కిషోర్ కూడా ప‌లు సినిమాల్లో త‌న కామెడీతో మెప్పించారు. ప్ర‌స్తుతమైతే త‌న కామెడీతో మెప్పించ‌డ‌మే కాకుండా త‌న కామెడీ టైమింగ్ వ‌ల్లే సినిమాకు క్రేజ్ ను పెంచుతున్నారు టాలీవుడ్ క‌మెడియ‌న్ స‌త్య‌.

జెట్‌లీ మూవీతో హీరోగా మారిన స‌త్య‌

స‌త్య న‌టించిన ప్రతీ సినిమాలోనూ త‌నదైన కామెడీ టైమింగ్ తో ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమా నుంచి స‌త్య క్రేజ్ మ‌రింత పెరిగింది. ఆ త‌ర్వాత దానికి సీక్వెల్ గా వ‌చ్చిన మ‌త్తు వ‌ద‌ల‌రా2లో కూడా స‌త్య న‌వ్వించి అల‌రించారు. స‌త్య‌కు ఉన్న ఈ క్రేజ్, డిమాండ్ తోనే అత‌ను హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో నితీష్ రానా ద‌ర్శ‌క‌త్వంలో జెట్‌లీ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

స‌త్య‌పై రీమిక్స్ సాంగ్

రీసెంట్ గా జెట్‌లీ నుంచి రిలీజైన టీజ‌ర్ కూడా ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే స‌త్య క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో పెరిగిందంటే అత‌ని డేట్స్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎదురుచూసేంత‌గా. తమ సినిమాలో స‌త్య‌తో ఏదైనా స్పెష‌ల్ ఎపిసోడ్ పెట్టాల‌ని డైరెక్ట‌ర్లు ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసే స్థాయికి ఆయ‌న ఎదిగారు. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతికి రాబోయే ర‌వితేజ సినిమా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్జప్తిలో స‌త్య‌పై ఓ రీమిక్స్ సాంగ్ ను మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. ఈ రీమిక్స్ సాంగ్ స‌త్య సోలోగా వ‌స్తుంద‌ని, ఈ సాంగ్ లో స‌త్య స్టెప్పులు ఆడియ‌న్స్ ను బాగా ఆక‌ట్టుకుంటాయ‌ని తెలుస్తోంది. ఏదేమైనా క‌మెడియ‌న్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఓ వైపు స్టార్ క‌మెడియ‌న్ గా ఉంటూనే మ‌రోవైపు హీరోగా సినిమా చేస్తున్నారంటే అత‌ని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News