నిన్న బ‌న్నీ..ఇప్పుడు మ‌హేష్ ఏం జ‌రుగుతోంది?

దీంతో బ‌న్నీ మ‌రోసారి వివాదంలో ఇరుక్కోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌న్నీతో పాటు శ్రీ‌లీల కూడా కార్పొరేట్ కాలేజీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది.;

Update: 2025-04-22 09:25 GMT

టాలీవుడ్‌కు 2025 అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస వివాదాలు చుట్టుముడుతూ ఆర్టిస్ట్‌ల‌ని, స్టార్ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప 2` అద్యంద వివాదంగా మారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌కు ముందు ప్ర‌త్యేకంగా సంధ్యా థియేట‌ర్‌లో ఏర్పాటు చేసిన ప్రీమియ‌ర్ షో స‌మ‌యంలో థియేట‌ర్ వ‌ద్ద భారీ స్థాయిలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డం, అందులో ఓ యువ‌తి మృతి చెంద‌డం తెలిసిందే.

ఆ యువ‌తి త‌న‌యుడు కూడా తీవ్ర అస్వ‌స్థ‌కు గురి కావ‌డం, అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో బ‌న్నీపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ఆగ‌మేఘాల మీద ఆయ‌న్ని చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించి ఒక్క‌రోజు జైలులో గ‌డిపేలా చేయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత బెయిల్ కోసం బ‌న్నీ భారీగా ఖ‌ర్చు చేసి బెయిల్‌పై బ‌య‌టికి రావ‌డం తెలిసిందే. దీని నుంచి టాలీవుడ్‌తో పాటు బ‌న్నీ బ‌య‌టికి రావ‌డానికి నెల రోజులు ప‌ట్టింది. ఆ త‌రువాత `పుష్ప 3` సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌లేక‌పోయిన బ‌న్నీ సైలెంట్ అయిపోయాడు.

కొన్ని రోజుల త‌రువాత అట్లీతో కొత్త సినిమాకు శ్రీ‌కారం చుట్టడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మ‌రోసారి బ‌న్నీ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఓ కార్పొరేట్ కాలేజీకి బ‌న్నీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇదే ఇప్పుడు బ‌న్నీని వివాదంలో ఇరుక్కునేలా చేసింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ స‌భ్యులు బ‌న్నీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌టం వ‌ల్లే ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశ‌నం అయ్యాయ‌ని, బ‌న్నీని అరెస్ట్ చేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో బ‌న్నీ మ‌రోసారి వివాదంలో ఇరుక్కోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌న్నీతో పాటు శ్రీ‌లీల కూడా కార్పొరేట్ కాలేజీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. త‌న‌కు కూడా ఇదే కార‌ణాన్ని చూపుతూ త‌న‌ని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ స‌భ్యులు. వీరి వివాదం ఇలా ఉంటే తాజాగా మ‌హేష్ బాబు కూడా వివాదంలో ఇరుక్కున్నారు. మ‌హేష్ ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇందుకు స‌ద‌రు సంస్థ నుంచి మ‌హేష్ పారితోషికం కింద రూ.3.4 కోట్ల మొత్తం తీసుకున్నార‌ట‌. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై ద‌ర్య‌ప్తు చేస్తున్న ఈడీ మ‌హేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఈడీ కార్యాల‌యంలో హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేయ‌డం ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది. ఇలా టాలీవుడ్‌కు చెందిన స్టార్లు వ‌రుస వివాదాల్లో చిక్కుకొని వార్త‌ల్లో నిల‌వ‌డం అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.

Tags:    

Similar News