ఫ్యాన్స్ ఆన్‌లైన్ కుట్ర‌లు ఆపేదెలా?

సామాజిక మాధ్య‌మాలు- డిజిట‌ల్ యుగంలో అభిమానుల మ‌ధ్య ఫ్యాన్ వార్ ముదిరిపాక‌న ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-09 09:30 GMT

సామాజిక మాధ్య‌మాలు- డిజిట‌ల్ యుగంలో అభిమానుల మ‌ధ్య ఫ్యాన్ వార్ ముదిరిపాక‌న ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇరువురు స్టార్ల మ‌ధ్య యుద్ధంలా దీనిని అభిమానులు మారుస్తున్నారు. టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ప్ర‌భాస్ ఫ్యాన్ వార్ గురించి, మ‌హేష్ వ‌ర్సెస్ ప‌వ‌న్ ఫ్యాన్ వార్ గురించి తెలిసిందే. మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఫ్యాన్ వార్ ఒక్కోసారి అదుపు త‌ప్పే ప‌రిస్థితి కూడా ఉంటుంది. స్టార్లు ఒక‌రితో ఒక‌రు స్నేహంగా ఉన్నా, ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లో క‌లిసిపోతున్నా కానీ, ఈ ఫ్యాన్ వార్ ల‌ను ఆప‌డం అసాధ్యంగా మారింది. ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్ దీనిని ఆట‌విడుపుగా భావిస్తున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ నేపో కిడ్స్ పై ఫ్యాన్ వార్ స‌ర్వత్రా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అక్క‌డ న‌ట‌వార‌సులైన‌ ర‌ణ‌బీర్ - ఆలియా జోడీపై కంగ‌న అభిమానులు సాగిస్తున్న దుందుడుకు చ‌ర్య‌లు చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.

అతి వ్యాఖ్య‌లు త‌గ‌దు:

ఆ ఇద్ద‌రూ తండ్రి కూతుళ్ల‌లాగా ఉన్నారు! అంటూ కంగ‌న ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా ర‌చ్చ‌గా మారింది. అంతేకాదు.. నెపోకిడ్స్ అయిన కంగ‌న‌-ఆలియా ఇద్ద‌రితో అయాన్ ముఖ‌ర్జీని ముడిపెడుతూ కొన్ని చెత్త కామెంట్లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ ముగ్గురూ ముక్కోణ‌పు ప్రేమ‌లో ఉన్నార‌ని కూడా నెటిజ‌నులు త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే క్వీన్ కంగ‌న ప్ర‌తిసారీ ర‌ణ‌బీర్, ఆలియా, అయాన్ ముఖ‌ర్జీ లాంటి నేపోల‌పై విరుచుకుప‌డుతుంటారు. అందువ‌ల్ల కంగ‌న‌ను స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు కూడా ఇష్టానుసారం కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారని భావించాల్సి వ‌స్తోంది. అభిమానులు అన‌వ‌స‌రంగా ఆన్ లైన్ కుట్ర‌లు కుతంత్రాల‌కు తెర తీస్తున్నారు.

టాలీవుడ్ టు బాలీవుడ్ ఇదే వ‌రుస‌ ...

అయితే ఇది స‌రైన విధానం కాద‌ని చాలా మంది వారించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ ఫ్యాన్స్ ఎప్పుడూ ఇదే వ‌రుస‌. దీనికంటే న‌టీన‌టుల్లో బెట‌ర్ మెంట్ గురించి, లేదా నాణ్య‌మైన‌ స్క్రిప్టుల‌ ఎంపిక‌ల గురించి కామెంట్లు చేస్తే బావుంటుంది. వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయాల‌నుకోవ‌డం స‌రికాదు. విమ‌ర్శించాలి కానీ, నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రైన‌ది అని కూడా కొంద‌రు సూచిస్తున్నారు. అది కంగ‌న వ‌ర్సెస్ ఆలియా అయినా, ప‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌భాస్ అయినా, మ‌హేష్ వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అయినా, చిరు వ‌ర్సెస్ బాల‌య్య అయినా వారి గురించి నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు మాత్ర‌మే చేయాలి కానీ, అన‌వ‌స‌ర‌మైన ఫ్యాన్ వార్ తో విసిగించ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. ఎదుటివారు మ‌న‌ల్ని అస‌హ్యించుకునే కామెంట్లు చేయ‌డం త‌గ‌ద‌ని కూడా విలువైన సూచ‌న‌లు అందిస్తున్నారు. సెల‌బ్రిటీల గోప్య‌త‌ను త‌ప్పనిస‌రిగా గౌర‌వించాలి. కేవలం సెల‌బ్రిటీల విష‌యంలోనే కాదు, అస‌భ్య ప‌ద‌జాలంతో కించ‌ప‌రిచే వ్యాఖ్యానాలు ఎవ‌రి విష‌యంలోను చేయకూడ‌దు. చ‌ట్ట ప‌రంగా ప‌రిధి విస్త‌రించిన ఈ రోజుల్లో మాట పొదుపు, అదుపు చాలా ముఖ్యం.

ఆ న‌లుగురి ప్ర‌యాణం..

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...కంగ‌న వ‌రుస ఫ్లాపుల‌తో పూర్తిగా డైల‌మాలో ఉంది. ఆలియా పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై కుమార్తె రాహాతో గ‌డిపేస్తోంది. ర‌ణ‌బీర్ ప్ర‌స్తుతం 'రామాయ‌ణం' ఫ్రాంఛైజీతో పాటు, భ‌న్సాలీ 'ల‌వ్ అండ్ వార్' చిత్రాన్ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించిన వార్ 2 ఈనెల 14 విడుద‌ల‌కు వ‌స్తోంది. ఈ సినిమా విక్ట‌రీ అత‌డి భవిష్య‌త్ ని నిర్ధేశిస్తుంది.

Tags:    

Similar News