పిక్‌టాక్ : రెడ్ డ్రెస్‌లో మెరుపులు కురిపిస్తోంది
ఈసారి రియా రెడ్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. క్లీ వేజ్ షో చేస్తూ, నడుము అందాలను చూపించడం ద్వారా రియా చూపు తిప్పనివ్వడం లేదు.;
తెలుగు సినిమా 'తూనీగా తునీగా'తో ఇండస్ట్రీకి పరిచయం అయిన రియా చక్రవర్తి బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కారణంగా కెరీర్ తలకిందులు అయింది. రియా చక్రవర్తి ఆ కేసు కారణంగా దాదాపు మూడు నాలుగు ఏళ్ల ఇండస్ట్రీలో కనిపించలేదు. తిరిగి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సోషల్ మీడియాలో మునుపటి ఉత్సాహంతో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవల వరుసగా రియా చక్రవర్తి ఫోటో షూట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే మనం కూడా ఆమె అందాల ఆరబోత ఫోటోల గురించి మాట్లాడుకున్నాం. ఇంతలో మరోసారి తన అందమైన ఫోటో షూట్ కారణంగా రియా చక్రవర్తి సోషల్ మీడియాలో, వార్తల్లో నిలిచింది.
రెడ్ డ్రెస్‌లో అందాల రియా చక్రవర్తి
ఈసారి రియా రెడ్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. క్లీ వేజ్ షో చేస్తూ, నడుము అందాలను చూపించడం ద్వారా రియా చూపు తిప్పనివ్వడం లేదు. రెడ్ డ్రెస్‌లో నెటిజన్స్ హృదయాల్లో మెరుపులు మెరిపిస్తున్న ఈ అమ్మడు సినిమాల్లో ఖచ్చితంగా గట్టి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి అందమైన ఫోటోలను ఫిల్మ్ మేకర్స్ చూస్తే గతంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా వరుస సినిమా ఆఫర్లు ఇవ్వడం ఖాయం అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న రియా చక్రవర్తి పాపం కెరీర్ అర్థాంతరంగా నాశనం అయింది. ఆ సంఘటన జరిగి ఉండకుంటే ఖచ్చితంగా బాలీవుడ్‌లో ఇప్పటి వరకు టాప్ హీరోయిన్స్ జాబితాలో నిలిచేది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రియా చక్రవర్తి రెడ్ హాట్ డ్రెస్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతితో...
ఈ అందాల ఫోటో షూట్‌ను నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఫోటోలకు వేలల్లో లైక్స్ కొడుతున్నారు. సన్నగా నాజూకుగా ఉన్న రియా చక్రవర్తి ఇప్పటికీ యంగ్ హీరోలకు జోడీగా నటించేంత అందంగా, స్లిమ్‌గా, చిన్న ఏజ్ అమ్మాయిగా కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే అందాల ఆరబోత కొనసాగితే ఖచ్చితంగా బాలీవుడ్‌లో ఈమె రీ ఎంట్రీ గట్టిగానే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం వల్లే జాన్వీ కపూర్ హిట్స్ లేకుండా కెరీర్‌లో నెట్టుకు వస్తుందని, అలాగే రియా సైతం ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను మరిన్ని షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచి ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా మంచి సినిమా ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఎంటీవీ ఇండియా ఛానల్‌లో వీజేగా కెరీర్
ఎంటీవీ ఇండియాలో వీజేగా చేయడం ద్వారా రియా చక్రవర్తి కెరీర్‌ను ప్రారంభించింది. 2012లో తెలుగు సినిమా తూనీగా తూనీగా లో నటించింది. ఆ తర్వాత హిందీలో 2013 సంవత్సరంలో మేరే డాడ్ కి మారుతి సినిమాలో కనిపించింది. కర్ణాటకకు చెందిన బెంగాలీ కుటుంబంలో జన్మించిన రియా చక్రవర్తి పాఠశాల విద్యను అంబాలా కాంట్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చేసింది. 2009లోనే ఎంటీవీ ఇండియా లో ఛాన్స్ దక్కించుకుంది. ఎంటీవీ రియాల్టీ షో లో రన్నరప్‌గా నిలవడంతో అదే ఛానల్ లో వీజేగా చేసే అవకాశం దక్కించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ తో ఈమె ప్రేమాయణం సాగించిందనే వార్తలు వచ్చాయి.
ఆ వార్తలపై అధికారిక ప్రకటన రాకముందే సుశాంత్ సింగ్ మృతి చెందాడు. ఆ సమయంలో సుశాంత్‌కి రియా చక్రవర్తి డ్రగ్స్ సప్లై చేయడం వల్లే అతడు మృతి చెందాడు అంటూ ఆరోపణలు వినిపించాయి. ఆ కేసులో రియా అరెస్ట్ అయ్యి కొన్నాళ్లు జైలు జీవితంను గడిపిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రియా కొత్త జీవితాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాల్లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు మొదలు పెట్టింది.