శీతాకాలంలో గ్లామర్ తో హీట్ పుట్టిస్తున్న నభా నటేష్!
కార్తికేయ 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం చేసి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.;
కార్తికేయ 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం చేసి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఆ తర్వాత స్వయంభు మూవీని ప్రకటించారు. వాస్తవానికి గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ తో పాటు ప్రముఖ బ్యూటీ నభా నటేష్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. 2026 ఫిబ్రవరి 13న విడుదల కాబోతోంది.
తెలుగు , తమిళ్ , కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో అటు టీజర్లు, మేకింగ్ వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులోకి వచ్చి ఆడియన్స్ కి సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇందులో నిఖిల్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. ఇటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు నభా నటేష్ కూడా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ను వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా తన సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శీతాకాలంలో హీట్ పుట్టిస్తూ అందాలను ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ
తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోటోలలో బ్లేజర్ ధరించిన ఈమె గమ్ బూట్స్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. కారులో స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ.. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలకు ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. ముఖ్యంగా హార్ట్, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఆమెపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలకి కొంతమంది వింటేజ్ వైబ్స్ అని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది లేడీ సూపర్ స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. మొత్తానికి నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో అరంగేట్రం చేసిన ఈమె.. 2018లో తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాతో సోషల్ మీడియాలో ఈమెను ఇస్మార్ట్ బ్యూటీ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
డిస్కో రాజా, సోలో బ్రతికే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు స్వయంభు అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా నభా నటేష్ కి ఎటువంటి గుర్తింపు అందిస్తుందో చూడాలి.