జపనీగా మారిన మీనాక్షి.. గెటప్ అదుర్స్!

మీనాక్షి చౌదరి.. ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2025-09-14 04:56 GMT

మీనాక్షి చౌదరి.. ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. తాజాగా జపాన్ కి వెకేషన్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడినుండి పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఈమె తాజాగా జపనీగా మారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా జపనీయులు ధరించే దుస్తులు ధరించి వారి గెటప్లో మరింత అందంగా కనిపించింది.


జపనీలు ఎలా అయితే తమ గెటప్ తో అందరినీ ఆకట్టుకుంటారో.. మీనాక్షి చౌదరి కూడా పింక్ కలర్ డ్రెస్ ధరించి, అచ్చం వారిలాగే రెడీ అయ్యి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం మీనాక్షికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ ఫోటోలను షేర్ చేస్తూ కింద క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ.


తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను మీనాక్షి షేర్ చేస్తూ.. "నేను జపాన్ నుండి తిరిగి వచ్చేసాను. అయినా సరే జపాన్ నుండి ఎంతోమంది స్నేహితులను కూడా పొందగలిగాను. ఈ మొత్తం ప్రయాణంలో నాకు అత్యంత ఇష్టమైన రోజును మీతో పంచుకోవాలనుకున్నాను. అందులో భాగంగానే జపాన్ లో ఎప్పుడు కిమోనోలో ఫోటోలు దిగాలి అని కలలు కనేదాన్ని. కానీ ఎట్టకేలకు దానిని సహకారం చేసుకున్నాను. "అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. మొత్తానికి కల నెరవేరింది అంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ..


మీనాక్షి చౌదరి కెరియర్ విషయానికి వస్తే.. హర్యానాకు చెందిన ఈమె భారతదేశానికి చెందిన మోడల్ గా పేరు దక్కించుకుంది. పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసిన ఈమె.. మయన్మార్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలలో పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచింది. ఇక తర్వాత 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని అందుకున్న ఈమె.. 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ని కూడా అందుకుంది.


మీనాక్షి కెరియర్ విషయానికి వస్తే.. హిందీ సినిమా ద్వారా కెరియర్ ను ఆరంభించిన ఈమె 2021 లో 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలోనే పరవాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో నటించింది.. శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన 'హిట్: ది సెకండ్ కేస్' సినిమాలో అడివి శేషు సరసన హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ అందుకుంది.. గత ఏడాది గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ వంటి చిత్రాలలో నటించిన మీనాక్షి చౌదరి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకుంది. ఇప్పుడు విశ్వంభర సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News