• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: టైగర్...

ట్రైలర్ టాక్: టైగర్ నాగేశ్వరరావు .. అంతకుమించిన కథ

| స్టువర్టుపురం గజదొంగగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వారిలో టైగర్ నాగేశ్వరరావు అనే పేరు బాగా వైరల్ అయ్యేది

By - Tupaki Desk
Update: 2023-10-03 09:51 GMT

స్టువర్టుపురం గజదొంగగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వారిలో టైగర్ నాగేశ్వరరావు అనే పేరు బాగా వైరల్ అయ్యేది. అయితే ఇప్పుడు అదే పేరుతో మాస్ మహారాజ రవితేజ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. దర్శకుడు వంశీ ఎంతో కాలంగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసి మరి సినిమాను మొదలుపెట్టాడు.

ఇక రవితేజ కెరీర్ లోనే అత్యధిక భారీ అంచనాలతో ఈ సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా విడుదల కాబోతోంది. ది కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇక నేడు ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ తో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇప్పటికే టీజర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో అంచనాల స్థాయిని మరింత పెంచేసింది.

కొన్ని దశాబ్దాల క్రితం స్టువర్టుపురం అంటేనే దొంగలు ఎక్కువగా గుర్తుకు వచ్చేవారు. ఇక అక్కడ ఎలాంటి లూటీ చేయాలన్న కూడా ముందే ఏరియాలను వేలంపాటలో దక్కించుకోవాల్సి ఉంటుంది అనేలా ట్రైలర్ లో చూపించారు. ఇక ఆ విధంగా దొంగలలో అతి భయంకరమైన దొంగగా రవితేజను ప్రజెంట్ చేశారు. ఒకవైపు డబ్బు బంగారం పై మొహం పెంచుకున్న టైగర్ నాగేశ్వరరావు మరోవైపు అమ్మాయిలకు కూడా ఎట్రాక్ట్ అయ్యాడు అని చూపించారు.

ఇక కొందరు చేసిన కుట్రల కారణంగా అతను జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత మళ్లీ తప్పించుకోవడం.. ఇంతలో మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ టైగర్ నాగేశ్వరరావును టార్గెట్ చేయడం వంటి అంశాలను ట్రైలర్ లో బాగా పొందుపరిచారు. ఇక చివరికి అతనికి కనెక్షన్స్ సీఎం పీఎం లెవెల్ లో ఉన్నాయి అన్నట్లుగా కూడా చూపించడంతో ఈ కథ మరింత లోతుగా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

టైగర్ నాగేశ్వరరావు జీవితంలో అంశాలను తీసుకుని దానికి దర్శకుడు వంశీ మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జత చేయబోతున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వంటి పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం కానుంది. అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. మరి సినిమా వెండితెరపై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • Tigernageswararaotrailer 
  • Raviteja 
  • Vamsee 
  • Abhishekagarwal 
  • Tigernageswararao 
  • Nupursanon 
  • Gayatribharadwaj 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS