అండర్‌వేర్‌లో క్రికెట్ ఆడిన బాలీవుడ్ స్టార్
ఇదిలా ఉంటే ఇప్పుడు టైగర్ ష్రాఫ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యతో కలిసి అండర్‌వేర్ లో క్రికెట్ ఆడుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్ లో షేర్ చేశాడు.;
బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. జాకీ ష్రాఫ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టిన టైగర్ ష్రాఫ్ తన డ్యాన్సులు, నటనతో తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హీరోపంతి సినిమాతో వెండితెర అరగేంట్రం చేసిన టైగర్ ష్రాఫ్ ఆ తర్వాత బాఘీ, బాఘీ2 తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని స్టార్ హీరో అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ అందుకున్న టైగర్, ఇప్పుడు సరైన సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు టైగర్ ష్రాఫ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యతో కలిసి అండర్‌వేర్ లో క్రికెట్ ఆడుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్ లో షేర్ చేశాడు. టైగర్ షేర్ చేసిన ఆ వీడియో వెంటనే నెట్టింట వైరల్ అవడంతో పాటూ అతని పోస్ట్ కు నెటిజన్ల నుంచి మిక్డ్స్ రియాక్షన్స్ వస్తున్నాయి.
ఈ వీడియోను చూసి కొంతమంది ఫ్యాన్స్ టైగర్ ఫిట్‌నెస్ బాడీని, అతని కాన్ఫిడెన్స్ ను మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం అతను దుస్తుల శైలిని ఎగతాళి చేస్తూ టైగర్ ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో దీన్ని చడ్డీ ప్రీమియర్ లీగ్ అని సరదాగా పిలుస్తూ ఆ పోస్ట్ కు పలు కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు మోగ్లీ జంగిల్ బుక్ లోని చడ్డీ పెహెన్ కే క్రికెట్ ఖిలా హై అనే సాంగ్ ను కామెంట్స్ లో పోస్ట్ చేస్తుంటే మరికొందరు అండర్‌వేర్ లో బ్యాట్స్‌మెన్ ను ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పోస్ట్ చేస్తే ట్రోలింగ్ ఉంటుందని టైగర్ కు తెలిసినప్పటికీ అతను మాత్రం ఈ వీడియోకు హ్యూమర్ తో కూడిన క్యాప్షన్ ను ఇచ్చాడు.
కాగా టైగర్ ష్రాఫ్ ఆఖరిగా సింగం అగైన్, బడే మియాన్ చోటే మియాన్ సినిమాల్లో కనిపించాడు. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు టైగర్ మరోసారి బాఘీ ఫ్రాంచైజ్ పైనే ఆశలు పెట్టుకుని బాఘీ4 చేస్తున్నాడు. సంజయ్ దత్, సోనం బజ్వా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న బాఘీ4 సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.