• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ - చరణ్ - ప్రభాస్.....

బన్నీ - చరణ్ - ప్రభాస్.. అక్కడే బిజీబిజీగా..

| రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.

By - Tupaki Desk
Update: 2024-02-25 05:39 GMT

టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ గా డార్లింగ్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.

ఈ మూడు సినిమాలకి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతూ ఉండటం విశేషం. ప్రభాస్ కల్కి 2898ఏడీకి సంబందించిన కీలక సన్నివేశాలని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటంతో దానికి తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ చేసి నైట్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక గేమ్ చేంజర్ లో యాక్షన్ ఘట్టాలని ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్నారంట. ఈ షెడ్యూల్ తో రామ్ చరణ్ కి సంబందించిన మేగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది. దీని తర్వాత ఒకటి, రెండు షెడ్యూల్స్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఫారెస్ట్ సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగ్ కూడా షూట్ చేశారు. ఇప్పుడు కీలక సన్నివేశాలని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ ఒకే చోట షూటింగ్ చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కావాల్సినవే కావడం విశేషం.

కల్కి మూవీ మేలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పుష్ప 2 ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గేమ్ చేంజర్ రిలీజ్ పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇండియన్ 2 రిలీజ్ తర్వాత శంకర్ ఈ మూవీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలపైనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వీటిలో కల్కి పాన్ వరల్డ్ మూవీ కాబట్టి బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Salaar 
  • Prabhas 
  • Pushpa2 
  • Alluarjun 
  • Gamechanger 
  • Ramcharan 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS