• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అటు ఇటు కాకుండా సీనియర్...

అటు ఇటు కాకుండా సీనియర్ స్టార్ పరిస్థితి..?

| ఒకప్పుడు స్టార్ హీరోగా యాక్షన్ ప్రియులను అలరించిన రాజశేఖర్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.

By - Tupaki Desk
Update: 2024-02-02 02:45 GMT

యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ఈమధ్య నితిన్ సినిమా ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోగా యాక్షన్ ప్రియులను అలరించిన రాజశేఖర్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అయితే కొత్త సినిమాలు కొత్త హీరోల వల్ల దాదాపు 10, 15 ఏళ్ల దాకా ఆయన కెరీర్ లో వెనకపడ్డారు. ఎవడైతే నాకేంటి సినిమాతో మరోసారి ఆయన సత్తా చాటగా అప్పటి నుంచి మళ్లీ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.


ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా జస్ట్ ఓకే అనిపించగా ఆర్జీవితో గడ్డం ఇలా వచ్చి అలా వెళ్లింది. హీరోగా అవకాశాలు రావట్లేదు కదా అని సపోర్టింగ్ రోల్స్, విలన్ ఇంకా స్పెషల్ రోల్స్ కి ఓకే అంటున్నారు రాజశేఖర్ కానీ ఆయన్ను అలాంటి పాత్రల్లో తీసుకునేందుకు కూడా ఎందుకో మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. హీరోగా ఎలాగు సినిమాలు రావని ఫిక్స్ అయిన రాజశేఖర్ ఇక మీదట సినిమాలో ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అనేస్తున్నారు. ఆయన సాఫ్ట్ నేచర్ మెంటాలిటీ వల్ల విలన్ గా రాజశేఖర్ సెట్ అవ్వరని కొందరు ఫీల్ అవుతున్నా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తనలోని విలనిజం చూపిస్తానని అంటున్నారు రాజశేఖర్.

రెమ్యునరేషన్ కూడా అంత భారీ డిమాండ్ చేయట్లేదని టాక్. అయినా కూడా రాజశేఖర్ కు సినిమాలు రావట్లేదు. నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం కూడా రాజశేఖర్ బ్యాడ్ లక్ ని కొనసాగించేలా చేసింది. అయితే ఇప్పుడు కాకపోయినా రాజశేఖర్ కచ్చితంగా ఎప్పటికైనా తిరిగి ఫాం లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక కెరీర్ లు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. శివాని ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తున్నా శివాత్మిక ఆరంభం అదరగొట్టినా ఆ తర్వాత ఫోటో షూట్స్ తో తనపై అటెన్షన్ రాబట్టాలని చూస్తుంది. రాజశేఖర్ మాత్రం కెరీర్ మళ్లీ ఊపందుకోవాలని ప్రయత్నిస్తున్నా సరే ఆయనకు ఆఫర్లు ఇచ్చే వాళ్లు మాత్రం లేరని చెప్పొచ్చు. కొన్నాళ్లు సొంత నిర్మాణంలో సినిమాలు చేసిన రాజశేఖర్ ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా చేయట్లేదు. యాంగ్రీ యంగ్ మెన్ కి మళ్లీ అవకాశాలు ఇస్తే మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారన్నది చూడాలి.


Tags:    
  • Extraordinaryman 
  • Nithin 
  • Rajasekhar 
  • Evadinakenti 
  • Prasanthvarma 
  • Kalki 
  • Shivani 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS