సోషల్ మీడియాలో ఆమెను ఏకి పారేస్తున్నారు

ఆమె ఓవర్‌ యాక్షన్‌కి తల నొప్పి లేచిందని కొందరు, సిరీస్ బడ్జెట్‌లో సగంను భూమి పారితోషికంగా ఇవ్వాలి అనిపించేంత ఓవర్‌ యాక్షన్‌ను ఆమె చేసిందని కొందరు అంటున్నారు.;

Update: 2025-05-13 14:12 GMT

సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో నెగిటివిటీ మరీ టూమచ్‌గా చూపిస్తున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌లు సైతం నెగిటివిటీని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయిన 'ది రాయల్‌' అనే వెబ్ సిరీస్‌ గురించి సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు వస్తున్నాయి. ఒక వెబ్‌ సిరీస్‌ ఈ స్థాయిలో నెగిటివిటీని ఎదుర్కోవడం ఈ మధ్య కాలంలో ఇదే అంటూ సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. మరీ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కునే విధంగా ఎలాంటి కంటెంట్‌ ఉంది అంటూ కొందరు సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌కు వెళ్లి చూసి మరీ ట్రోల్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ది రాయల్‌ టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అయింది.

ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్‌ మీడియాను ట్రోల్‌ చేయడానికి వాడుతున్నారు అనే టాక్‌ వినిపిస్తుంది. ది రాయల్‌ సినిమా పై వస్తున్న ట్రోల్స్ చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. మరీ దారుణంగా ఈ వెబ్‌ సిరీస్‌ను, అందులో నటించిన భూమి ఫడ్నేకర్‌ ఏకి పారేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను చూసిన తర్వాత తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరొకరు భూమి యొక్క ఓవర్‌ యాక్షన్‌తో మొత్తం సిరీస్‌ను తలకిందులు చేసింది అంటూ మరో నెటిజన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ గురించి మాట్లాడిన సందర్భంలో కామెంట్‌ చేయడం జరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది.

ది రాయల్‌ వెబ్‌ సిరీస్‌ మేకర్స్‌కి భూమి ఫడ్నేకర్‌ కాకుండా మరెవ్వరు దొరకలేదా.. ఆమె ఓవర్‌ యాక్షన్‌కి తల నొప్పి లేచిందని కొందరు, సిరీస్ బడ్జెట్‌లో సగంను భూమి పారితోషికంగా ఇవ్వాలి అనిపించేంత ఓవర్‌ యాక్షన్‌ను ఆమె చేసిందని కొందరు అంటున్నారు. భూమి ఫడ్నేకర్‌ యొక్క యాక్టింగ్‌కు గతంలోనూ విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అంటూ ఆమెను సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు. ఈ స్థాయిలో ఆమెను ట్రోల్స్ చేయడం దారుణం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు ఆమె తప్పు ఏముందని, దర్శకుడు చెప్పిన విధంగా ఆమె చెసిందే తప్ప ఆమె చేసిన తప్పు ఏంటి అంటూ కొందరు భూమిని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ది రాయల్స్ వెబ్‌ సిరీస్‌లో ఇషాన్ కట్టర్‌, సాక్షి తన్వర్‌, మిలింద్‌ సోమన్‌, లెజెండరీ జీనత్‌ అమన్‌లతో పాటు ప్రముఖులు నటించారు. కానీ వారితో పోల్చితే భూమి ఫడ్నేకర్‌ నటనకు విమర్శలు ఎక్కువ వచ్చాయి. సిరీస్‌ కథ, కథనం ఇతర విషయాలు కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇలాంటి వెబ్‌ సిరీస్‌ను ఎలా నిర్మించారు అంటూ కొందరు కామెంట్‌ చేస్తే, నటీ నటుల ఎంపిక విషయంలో మినిమం జాగ్రత్త తీసుకోకుండా ఎలా తీస్తారు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి ది రాయల్‌ వెబ్‌ సిరీస్‌, అందులో నటించిన భూమి ఫడ్నేకర్‌ ను ఓ రేంజ్‌లో నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు. ఈ విమర్శలతో అయినా ఆమె నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News