అంటే.. హీరోయిన్‌తో ప్రేమకథ నిజమేనా?

నిన్న జరిగిన 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.;

Update: 2025-11-20 10:42 GMT

టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ ఒకరు. 'పెళ్లి చూపులు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్, ప్రస్తుతం డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన కెరీర్ కంటే వ్యక్తిగత జీవితం గురించే ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆయన ఒక యువ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న తరుణ్, ఎట్టకేలకు ఈ విషయంపై నోరు విప్పారు.

నిన్న జరిగిన 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ యాంకర్ "మీరు చూసిన వాటిలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఏది?" అని అడగగా, తరుణ్ ఏమాత్రం తడబడకుండా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "నా లవ్ స్టోరీనే గ్రేటెస్ట్. ప్రస్తుతం నేను దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. అది ఇంకా నడుస్తూనే ఉంది" అని చెప్పడం ద్వారా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తరుణ్ ఓపెన్ గా చెప్పినప్పటికీ, ఆ అమ్మాయి పేరును మాత్రం రివీల్ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ యువ కథానాయిక పేరే నిజమని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. గతంలో లతా నాయుడును పెళ్లి చేసుకున్న తరుణ్, రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం సింగిల్ గా ఉన్న ఆయన, ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడ్డారని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.

పర్సనల్ లైఫ్ లో ఇంత బిజీగా ఉన్నా, కెరీర్ పరంగా కూడా తరుణ్ దూసుకెళ్తున్నారు. యూత్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, సుశాంత్, వెంకటేష్ కాకమాను కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా 2026లో విడుదల కానుంది.

మరోవైపు హీరోగానూ తరుణ్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. 'ఓం శాంతి శాంతి శాంతిహి' అనే సినిమాలో ఆయన మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా అటు డైరెక్షన్, ఇటు యాక్టింగ్, మరోపక్క లవ్ లైఫ్.. అన్నింట్లోనూ తరుణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.

Tags:    

Similar News