'తమ్ముడు' రిలీజ్ ట్రైలర్.. ఎలా ఉందంటే?
అందులో భాగంగా ఇప్పుడు మరో ట్రైలర్ ను తీసుకొచ్చారు. రిలీజ్ ట్రైలర్ పేరుతో గ్లింప్స్ ను విడుదల చేశారు.;
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన నితిన్.. ఇప్పుడు ఆయన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టైటిల్ తోనే సందడి చేయనున్నారు. అక్క- తమ్ముడు సెంటిమెంట్ స్టోరీతో థియేటర్స్ లోకి రానున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ సచ్ దేవా, స్వాసిక, హరితేజ, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న తమ్ముడు మేకర్స్.. జూలై 4న సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు గాను ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మరో ట్రైలర్ ను తీసుకొచ్చారు. రిలీజ్ ట్రైలర్ పేరుతో గ్లింప్స్ ను విడుదల చేశారు.
"మా అమ్మ చనిపోయింది.. అమ్మ అయినా నాన్న అయినా అన్నీ అక్కే.." అంటూ నితిన్ చెబుతున్న బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. చిన్నప్పుడు నితిన్ ను ఆడిస్తున్నట్లు లయ కనిపించారు. ఆ తర్వాత తమ్ముడు అనిపించుకోలేవ్ అంటూ దూరంగా వెళ్తున్నట్లు చూపించారు.
అనంతరం మొత్తం చిన్న చిన్న సీన్స్ ను చూపించిన మేకర్స్.. స్టోరీని రివీల్ చేశారు. అదే సమయంలో నితిన్.. తన అక్కకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తారు. అక్కడి నుంచి ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. వేరే లెవెల్ లో యాక్షన్ సీన్స్ లో నితిన్ నటించినట్లు ఉన్నారు.
ఆ తర్వాత ఓ ప్రాంతాన్ని మంటబెట్టినట్లు చూపించారు మేకర్స్. చివర్లో నితిన్.. వాడు ఒప్పుకున్నా తాను ఒప్పుకోను అంటూ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
మెయిన్ గా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందనే చెప్పాలి. నితిన్ మరోసారి సెటిల్డ్ గా నటించారు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. లయ గట్టి రీఎంట్రీ ఇస్తున్నట్లు ఉన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. వేణు శ్రీరామ్ మార్క్ కనిపించింది. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.