• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG.. థమన్ ఒరిజినల్...

OG.. థమన్ ఒరిజినల్ వాయించుడు..!

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేటెస్ట్ గా రిలీజైంది.

By - Tupaki Desk
Update: 2023-09-02 11:38 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇది కదా అసలైన పవన్ మాసిజం అనేస్తున్నారు. హంగ్రీ చీతాగా వచ్చిన ఈ ఫస్ట్ గ్లింప్స్ ఇలా రిలీజైందో లేదో అలా వైరల్ గా మారింది. నిమిషన్నర టీజర్ లో మేకింగ్ పరంగా సుజిత్.. టేకింగ్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టగా పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ తెప్పించింది. వీటికి తోడుగా థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. గ్యాంగ్ స్టర్ సినిమాలకు కావాల్సిన మ్యూజిక్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు.

ఒక్కో సినిమాకు థమన్ ఒక్కోలా మ్యూజిక్ అందిస్తుంటాడు. కొన్నిసార్లు అతను ఇచ్చిన మ్యూజిక్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంటే మరికొన్నిసార్లు మాత్రం అంచనాలను అందుకోదు. ఏది ఎలా ఉన్నా ఓజీ సినిమాకు మాత్రం థమన్ తన మ్యూజిక్ తో ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. OG టీజర్ లో థమన్ వీర లెవెల్ వాయించుడు చూసి ఇది కదా థమన్ ఒరిజినాలిటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ మీద తనకున్న అభిమానాన్ని మ్యూజిక్ రూపంలో చూపించాడు థమన్.

ఆల్రెడీ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీసెంట్ గా వచ్చిన బ్రో సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించగా OG సినిమాకు థమన్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ అందిస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో సినిమాతో ప్రభాస్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా సుజిత్ టేకింగ్ అదిరిపోయింది. తెలుగు ఆడియన్స్ కి అది అంతగా ఎక్కలేదు కానీ బాలీవుడ్ లో సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు సుజిత్.

ఈ సినిమా తర్వాత సుజిత్ కచ్చితంగా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరడం పక్కా అని చెప్పొచ్చు. ఓజీ జస్ట్ చిన్న టీజర్ తోనే ఓ రేంజ్ లో ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిన సుజిత్ మూవీతో సెన్సేషనల్ రికార్డులను సృష్టించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత డివివి ఎంటర్టైన్మెంట్స్ కి ఇది మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని ఫిక్స్ అవ్వొచ్చు. OGతో థమన్ మ్యూజిక్ సౌండింగ్ స్పీకర్లు బద్దలవడం పక్కా అనేలా ఉంది. సో థమన్ పూనకాలు వచ్చేలా చేస్తున్న ఓజీ సినిమా మ్యూజిక్ సినిమాకు ఎంత హైప్ తెస్తుందన్నది చూడాలి.

Tags:    
  • Pawankalyan 
  • OGMovie 
  • Thaman 
  • Tollywood 
  • Movienews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS