• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్నప్పుడే చేతికి...

చిన్నప్పుడే చేతికి స్టిక్‌... ఫస్ట్‌ లవ్‌ నా ప్రపంచం

| టాలీవుడ్‌ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం తమన్‌ సంగీత సారధ్యంలోనే రూపొందుతున్న విషయం తెల్సిందే

By - Tupaki Desk
Update: 2024-08-07 07:43 GMT

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ సంగీత దర్శకుడు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో తమన్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం తమన్‌ సంగీత సారధ్యంలోనే రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇతర సంగీత దర్శకులతో పోల్చితే తమన్‌ చాలా స్పీడ్. ఈయనతో సంగీతం చేయించుకుంటే సమయంకు ఇస్తాడు అని చాలా మంది అంటారట. అందుకే తమన్‌ అంత బిజీగా ఉన్నాడు అనేది కొందరి అభిప్రాయం.

కేవలం స్టార్‌ హీరోల సినిమాలే చేస్తా, పెద్ద దర్శకుల సినిమాలనే చేస్తా, పెద్ద బ్యానర్‌ లోనే సినిమాలు చేస్తా అనే పట్టుదల లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ కి న్యాయం చేసే విధంగా తమన్‌ సినిమాలను ఒప్పుకుంటాడు. తన సంగీతంతో చాలా సినిమాలను మంచి హిట్‌ చేసిన తమన్‌ ఇప్పుడు పవన్‌ ఓజీ తో పాటు రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సినిమాను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాలను చేస్తున్నాడు.

రాబోయే రోజుల్లో తమన్‌ మరిన్ని భారీ ప్రాజెక్ట్‌ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యాన్స్ తో పాటు నేను కూడా ఓజీ మరియు గేమ్‌ ఛేంజర్ సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రెండు నెలల్లో ఓజీ నుంచి కచ్చితంగా మంచి అప్‌డేట్‌ వస్తుంది అనే నమ్మకం ఉందని తమన్‌ అన్నాడు. ఇక గేమ్‌ ఛేంజర్ సినిమా కచ్చితంగా తన కెరీర్‌ కు గేమ్‌ ఛేంజర్ గా నిలుస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు.

ఫస్ట్‌ లవ్‌, జీవితంలో ఇష్టమైన విషయాల గురించి తమన్‌ మాట్లాడుతూ... నా చిన్నతనంలోనే నాన్న పాల డబ్బా కి బదులుగా మ్యూజిక్‌ స్టిక్స్ ఇచ్చారు. నా ఫస్ట్‌ లవ్‌ మాత్రమే కాదు.. ఎప్పటికీ నేను అమితంగా ప్రేమించేది సంగీతాన్ని మాత్రమే. సంగీతం తో నా జీవితం ప్రారంభం అయ్యింది. కనుక నా జీవితం మొత్తం సంగీతం ఉంటుంది అని తమన్‌ అన్నాడు. సంగీతం తో నా జీవితం ను సాగించడం సంతృప్తిని ఇస్తుంది. భవిష్యత్తులో కూడా సంగీతమే నా ప్రపంచం. ప్రతి సినిమాకు సాధ్యం అయినంత బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్ లోని మ్యూజిక్ కి మంచి స్పందన వచ్చింది. సినిమాలోని పాటలు మరియు బీజీఎం కి కచ్చితంగా మంచి మార్కులు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమాకు కూడా తమన్ సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. అఖండ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ తో స్పీకర్ లు బద్దలు కొట్టిన ఘనత తమన్‌ కి దక్కింది. అందుకే మరోసారి బాలయ్య కి కచ్చితంగా తమన్‌ ఓ రేంజ్ మ్యూజిక్ ఇవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Thaman 
  • Musicdirector 
  • Thamanfirstlove 
  • Filmindustry 
  • Ogmovie 
  • Gamechanger 
  • Therajasaab 
  • Thamanmusic 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS