నాగవంశీపై తమన్ ఫైర్! మరి ఇప్పుడేం చేస్తారో..

ఒక పాట చేయడం మాత్రమే కాదు.. దాని తర్వాత రికార్డింగ్, మిక్సింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉంటాయి. ఇక సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కీలకం.

Update: 2026-10-06 03:55 GMT

సినిమా వర్క్‌ లో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌ ను మరో పాట చేయమంటే ఎలా ఉంటుంది. అదే నిర్మాత నాగవంశీ చేసి చూశారు. కానీ ఆయనకు ఊహించని రియాక్షన్ ఎదురైంది. ఇంకో సాంగ్ చేద్దామని అడిగితే.. తమన్ ఏకంగా కొట్టడానికి వచ్చినంత పని చేశారట. అయితే ఇదంతా సీరియస్‌ గా కాదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌ షిప్‌ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ చాలా బిజీగా పనిచేస్తున్నారు. ఇప్పటికే నారాయణమ్మ అనే స్పెషల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సాంగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. మాస్ బీట్, ఎనర్జీతో సోషల్ మీడియాలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో సినిమాలో మరో పాట చేయాలని నాగవంశీ భావించారట. అదే విషయాన్ని తమన్‌తో చెప్పారట. కానీ అప్పటికే సినిమా వర్క్‌ తో బిజీగా ఉన్న తమన్.. ఇంకో పాట చేయమంటున్నావా.. సినిమా ఆపేయమంటావా అంటూ సరదాగా నాగవంశీపై ఫైర్ అయ్యారు! అంతేకాదు.. తనను కొట్టడానికి వచ్చినట్లు నాగవంశీ లేటెస్ట్ ప్రెస్ మీట్ లో నవ్వుతూ చెప్పడంతో ఆ విషయం ఇప్పుడు వైరల్‌ గా మారింది.

నిజానికి ఆ మాటల్లోనే తమన్ ఎంత సీరియస్‌గా సినిమా వర్క్ చేస్తున్నారో అర్థమవుతోంది. ఒక పాట చేయడం మాత్రమే కాదు.. దాని తర్వాత రికార్డింగ్, మిక్సింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉంటాయి. ఇక సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కీలకం. దీంతో ఆ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో నాగవంశీ మరో పాట అడగడంతో తమన్ అలా రియాక్ట్ అయ్యారన్నమాట.

అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. సిని రిలీజ్ వాయిదా పడటంతో టీమ్‌ కు మరికొంత సమయం దొరికింది. పనులన్నీ ఫ్లీగా కంప్లీట్ చేయవచ్చు. అంటే గతంలో టైమ్ లేదంటూ నాగవంశీని ఆటపట్టించిన తమన్‌ కు ఇప్పుడు కొంత ఖాళీ దొరికినట్టే. మరి ఈ గ్యాప్‌ లో నాగవంశీ తమన్‌ తో ఇంకో సాంగ్ చేయించుకునే ప్రయత్నం చేస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇక సినిమా నుంచి ఇప్పటికే నారాయణమ్మ పాట వచ్చేసింది. దానికి భిన్నంగా మరో పాటను తీసుకురావాలంటే తమన్‌ కు మంచి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వెంకటేష్ సినిమా కావడంతో పాటల విషయంలో ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉన్నాయి. దీంతో మరో సాంగ్ వస్తే అది ఎలాంటి మూడ్‌ లో ఉంటుంది, మాస్ నంబరా.. మెలోడీనా అనేది తెలియాల్సి ఉంది. మరి నాగవంశీ అండ్ తమన్ ఏం చేస్తారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News