స్టార్ తనయుడి ఫ్యాన్ బాయ్ మూమెంట్..!

దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో మరో విశేషం ఏంటంటే దళపతి విజయ్ క్యాజువల్ లుక్ లో కనిపించి చాలా కాలమైంది.;

Update: 2025-07-03 17:19 GMT

 కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి వర్సటైల్ యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. అతని వారసత్వాన్ని కొనసాగించేందుకు విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. విడుదల 2 లో అతను కనిపించాడు. ఇక ఇప్పుడు అతను లీడ్ రోల్ లో అనల్ అరసు డైరెక్షన్ లో ఫోయెనిక్స్ అనే సినిమా వస్తుంది. జూలై 4 అంటే రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. ఐతే ఈ సినిమాకు దళపతి విజయ్ కు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించగా సినిమాను ఆయన బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.

సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ అనల్ అరసుని, తెరంగేట్రం చేస్తున్న సూర్య సేతుపతికి తన బెస్ట్ విషెస్ చెప్పారు దళపతి విజయ్. విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి దళపతి విజయ్ కి వీరాభిమాని. తన మొదటి సినిమా ఆ స్టార్ రిలీజ్ ముందు చూసి తమని విష్ చేయడం తో సూర్య తో పాటు ఆ చిత్ర యూనిట్ అంతా సూపర్ జోష్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో మరో విశేషం ఏంటంటే దళపతి విజయ్ క్యాజువల్ లుక్ లో కనిపించి చాలా కాలమైంది. ఈమధ్య పొలిటికల్ పార్టీ పెట్టి వైట్ అండ్ వైట్ లో కనిపిస్తున్న దళపతి ఈ ఫోటోల్లో తన లుక్స్ తో ఆకట్టుకున్నారు.

 

విజయ్ సేతుపతి తనయుడు సూర్య ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా దళపతి విజయ్ పక్కన కనిపించాడు. అంత పెద్ద స్టార్ తనయుడైనా కూడా విజయ్ పక్కన సూర్య కామన్ మ్యాన్ లానే ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే అనల్ అరసు దాదాపు 20 ఏళ్లుగా ఫైట్ మాస్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. యాక్షన్ కొరియోగ్రఫీలో ది బెస్ట్ అనిపించుకున్న కొన్ని సినిమాల్లో సర్ ప్రైజింగ్ రోల్స్ కూడా చేశారు.

ఇక ఇప్పుడు సూర్య సేతుపతితో ఫోయెనిక్స్ అంటూ దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశారు. ఈ సినిమా రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఫోయెనిక్స్ కథ విషయానికి వస్తే ఇదొక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తుంది. సినిమాలో సూర్య సేతుపతితో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, దేవదర్షిణి నటించారు. సాం సి.ఎస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇంప్రెస్ చేశాయి. మరి దళపతి విజయ్ ని ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను కూడా అలరించేలా చేస్తుందా అన్నది మరికొద్ది గంటలు వెయిట్ చేస్తే తెలుస్తుంది.

Tags:    

Similar News