కొత్త 'కాంతార'.. మళ్లీ తెలుగు సర్కార్లు ఓకే చెబుతాయా?

ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కాంతార ప్రీక్వెల్ పనులను మేకర్స్ ఇప్పటికే పూర్తి చేశారు.;

Update: 2025-09-29 09:47 GMT

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా రూపొందుతున్న కాంతార చాప్టర్:1 రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కాంతార ప్రీక్వెల్ పనులను మేకర్స్ ఇప్పటికే పూర్తి చేశారు. అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో తెలుగులో కూడా సినిమాకు సాలిడ్ బిజినెస్ జరిగింది. అదే సమయంలో మేకర్స్.. ఇప్పుడు టికెట రేట్లు పెంచుకునేందుకు అనుమతులు కావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను విన్నవించుకున్నారు. మరికొన్ని గంటల్లో సర్కార్లు కూడా జీవోలు జారీ చేయనున్నాయని ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. డబ్బింగ్ మూవీలకు టికెట్లు రేట్ల పెంపునకు అనుమతులు ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ ధరల ఏం తక్కువ కాదని.. అయినా అన్ని సినిమాల రిలీజ్ కు ముందు ఎందుకు పెంచుతున్నారని అంటున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కే తెలుగు హీరోల సినిమాలకు కొంతకాలంగా ధరలు పెంచుతున్నారని.. అది చాలక ఇప్పుడు కాంతార వంటి డబ్బింగ్ మూవీలకు పెంచడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. రీసెంట్ గా వార్-2, కూలీ మూవీల మేకర్స్ కు కూడా అడిగిన విధంగానే ఉత్తర్వులు ఇచ్చేశారని, అది సరైన విధానం కాదని అంటున్నారు.

అయితే ఇటీవల తెలంగాణలో తెలుగు స్ట్రయిట్ మూవీ ఓజీకి రేట్లు పెంచగా.. ఆ వ్యవహారం హైకోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వాదనలు విన్న హైకోర్టు.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. కాంతార విషయంలో ఏం చేస్తాయో అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News