బీటెక్ నా వ‌ల్ల కావ‌డం లేదంటూ సినిమాల్లోకి తేజ‌!

`హ‌నుమాన్` తో పాన్ ఇండియాలో వెలుగులోకి వ‌చ్చిన తేజ స‌జ్జా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2025-06-16 04:36 GMT

'హ‌నుమాన్' తో పాన్ ఇండియాలో వెలుగులోకి వ‌చ్చిన తేజ స‌జ్జా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన 'హ‌నుమాన్' ఏకంగా వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో? అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లు ఎవ‌రీ యంగ్ హీరో అని ఆశ్చ‌ర్య‌పోయాయి. చిన్న వ‌య‌సులోనే ఇంత మెచ్యుర్టీనా? అంటూ షాక్ అయ్యారు. అంత‌కు ముందు `జాంబిరెడ్డి` తో మ‌రో హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాల‌న్నింటికంటే ముందు అత‌డు చైల్డ్ ఆర్టిస్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా వ‌య‌సు పెరిగే కొద్ది ముఖంలో కొన్ని ర‌కాల మార్పులొస్తుంటాయి. కానీ తేజ పేస్ పీచ‌ర్స్ లో మాత్రం పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌వు. వ‌య‌సుతో పాటు వ‌చ్చే కొన్ని ర‌కాల మార్పులు త‌ప్ప‌. ప్ర‌స్తుతం యంగ్ హీరో `మిరాయ్` అనే మ‌రో పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది డిఫ‌రెంట్ జానర్ చిత్రం.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్ అయితే తేజ కు పాన్ ఇండియా మార్కెట్ లో తిరుగుండ‌దు. అయితే పెద్ద అయిన త‌ర్వాత తేజ సినిమాల్లోకి ఎలా వ‌చ్చాడ న్న‌ది రివీల్ చేసాడు. బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతోన్న స‌మ‌యంలో ఇంజ‌నీరింగ్ చ‌దువు త‌న‌కు అబ్బడం లేద‌ని...సినిమాల్లోకి వెళ్తాన‌ని తండ్రితో చెబితే ఆయ‌న ఒకే అన్నారుట‌.

ఆ మాట అప్పుడు ఎంతో అయిష్టంగానే త‌ల‌ కింద‌కు దించుకుని అన్నారుట‌. ఎందుకంటే సినిమాలంటే ఆయ‌న‌కు పెద్ద‌గా ఇష్ట ఉండ‌దుట‌. చిన్న‌ప్పుడు సినిమా షూటింగ్ కు వెళ్లొచ్చి అక్క‌డ విష‌యాలు ఇంట్లో చెప్ప‌డం...తానెంత సంతోషంగా ఉన్నానో చెప్ప‌డం వంటి విష‌యాలతో నాన్న క‌న్విన్స్ అయ్య‌ర‌న్నాడు తేజ‌.

Tags:    

Similar News