ఐఎండీబీ టాప్ -5 లో యంగ్ హీరో చిత్రం!
యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తోన్న `మిరాయ్` పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.;
యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తోన్న `మిరాయ్` పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. 'హనుమాన్' తో పాన్ ఇండియా ఇమేజ్ ని కైవసం చేసుకున్న స్టార్ కావడంతో `మిరాయ్` పై అంచనాలు ఆకాశన్నం టుతున్నాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. హిందీ వెర్షన్ రైట్స్ ను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ చేజిక్కించు కోవడంతోనూ సినిమాకు కలిసొచ్చింది. నేరుగా కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేయడంతో? అక్కడా మంచి హైప్ వస్తోంది.
టీజర్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచడంతో ట్రైలర్ పై ఆసక్తి రెట్టింపు అయింది. ట్రైలర్ కోసం యంగ్ హీరో అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మిరాయ్' ప్రఖ్యాత గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ డేటాబేస్ ఐఎండిబీ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారతీయ చిత్రాల సర సన స్థానం సంపాదించింది. రేసులో ఏకంగా 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఏకంగా అగ్ర హీరోల సరసన ఓ యువ హీరో సినిమా నిలవడం అంటే? చిన్న విషయం కాదు.
సినిమాపై ఉన్న అంచనాలు..మార్కెట్..క్రేజ్ వంటి అశాల ఆధారంగా స్థానం కల్పిస్తుంది ఐఎండీబీ. దీంతో ఈ సినిమాపై బజ్ పీక్స్ కు చేరింది. సాధారణంగా ఐఎండీబీ అంటే? స్టార్ హీరోల చిత్రాలే పోటీలో కనిపిస్తుంటాయి. కోట్లాది మంది భారతీయులు ఎదురు చూసే చిత్రాలుగా వాటినే పేర్కొంటారు. యంగ్ హీరోల సినిమాలు స్థానం దక్కడం అన్నది చాలా అరుదు. అదీ పాన్ ఇండియాలో? పాపులర్ చిత్రాల సరసన `మిరాయ్` నిలవడం అంటే? గొప్ప విషయమే.
తేజ సజ్జా `హనుమాన్` అనే ఒక్క సినిమాతో పాన్ ఇండియాలో వెలుగులోకి వచ్చిన నటుడు. తేజ కంటే ముందే మరో ఇద్దరు పాన్ ఇండియా యంగ్ హీరోలున్నారు. కానీ వాటికి ఐఎండీబీలో గతంలో స్థానం దక్క లేదు. మరికొంత మంది సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియాలో రిలీజ్ లు ట్రై చేసారు. వాటికి కూడా ఐఎండిబీలో టాప్ 5 లో స్థానం దక్కలేదు.