• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి వారసుడి మాస్...

నందమూరి వారసుడి మాస్ ఎంట్రీ.. ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్

| మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, మీ తాత హరికృష్ణ గారు, మీ తండ్రి జానకీరామ్ అన్నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. Shine on My Boy!” అంటూ తారక రామారావుకు ఆశీర్వాదాలను అందించారు.

By - Tupaki Desk
Update: 2024-10-30 09:26 GMT

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో యువ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ అతనికి అభినందనలు తెలిపారు. దివంగత జానకీరామ్ తనయుడైన తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో, “తొలి మెట్టు ఎక్కుతున్నావు రామ్. సినిమా ప్రపంచం నీకు లెక్కలేనన్ని మధుర క్షణాల్ని అందిస్తుంది. విజయం నీతో ఉండాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, మీ తాత హరికృష్ణ గారు, మీ తండ్రి జానకీరామ్ అన్నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. Shine on My Boy!” అంటూ తారక రామారావుకు ఆశీర్వాదాలను అందించారు. ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

ఇక తారక రామారావు తొలి సినిమా గురించి ఎన్టీఆర్ మాత్రమే కాకుండా, నందమూరి కుటుంబం నుండి మరికొందరు కూడా అభినందనలు తెలిపారు. తన సోదరుడి ఎంట్రీపై నందమూరి కల్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. "నా ప్రియమైన రామ్‌కు నా బెస్ట్ విషెస్. నీ డెబ్యూ సినిమాతో మాకు గర్వకారణం కావాలని, నీ కెరీర్‌లో ఎంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను" అని కల్యాణ్ రామ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.

తారక రామారావు యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఇందులో తారక రామారావు లాంగ్ హెయిర్ స్టైల్, మాస్ లుక్‌తో బైక్ మీద రైడ్ చేస్తూ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాత ఎన్టీఆర్ లాంటి గంభీరమైన హావభావాలతో అతను కనిపించడం, ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి కలిగిస్తోంది.

తారక రామారావు సినిమా కోసం వైవీఎస్ చౌదరి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించినట్లు తెలిసింది. సీనియర్ టెక్నీషియన్స్, ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించనున్న ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. అలాగే రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7

— Jr NTR (@tarak9999) October 30, 2024

My best wishes to my dearest RamHope you will make all of us proud with your debut film and go a long way in your career. pic.twitter.com/OW4keh5yyE

— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 30, 2024
Tags:    
  • Tarakaramarao 
  • JrNTR 
  • Socialmediatweet 
  • Nandamurifamily 
  • Janakiram 
  • Yvschowdhary 
  • Kalyanram 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS