స్వయంకృషితో కోటీశ్వరురాలిగా సుస్మితా సేన్!

ఇంట్లోని ఇంటీరియర్ డిజైన్, ఆధునిక వసతులు , ప్రశాంతమైన వాతావరణం ముంబై సెలబ్రిటీల ఇళ్లలో ప్రత్యేకంగా నిలుస్తుంది.

Update: 2026-06-07 11:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమతో పాటు అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిని చాటిన అరుదైన వ్య‌క్తుల్లో సుస్మితా సేన్ ఒకరు. 1994లో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనదైన నటనతో.. స్వతంత్ర ఆలోచనలతో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా.. పారిశ్రామికవేత్తగా .. సింగిల్ మదర్‌గా సుస్మితా స‌సేన్ లీడ్ చేస్తున్న లైఫ్‌స్టైల్ నేటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా సుస్మితా సేన్ ఆస్తుల‌కు సంబంధించి నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది.

ఓ సారి ఆ వివ‌రాల్లోకి ఎళ్తే ..ప్రస్తుతం సుస్మితా సేన్ నికర ఆస్తి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ సంపదందా సుస్మిత స్వయంకృషితో సంపాదించిందే. నటన.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు .. వివిధ వ్యాపారాల ద్వారా ఆర్జించారు. బాలీవుడ్‌లో స్వయంకృషి గల స్టార్‌గా ఎదిగిన సుస్మిత, కేవలం నటిగానే కాకుండా ఆర్థిక వ్యూహాలతో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ముంబైలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్సోవా ప్రాంతంలో సుస్మితా సేన్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఎంతో కళాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఆమె అభిరుచికి అద్దం పడుతుంది.

ఇంట్లోని ఇంటీరియర్ డిజైన్, ఆధునిక వసతులు , ప్రశాంతమైన వాతావరణం ముంబై సెలబ్రిటీల ఇళ్లలో ప్రత్యేకంగా నిలుస్తుంది. సుస్మిత‌ తరచుగా తన కుమార్తెలు .. కుటుంబంతో గడిపే మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలలో ఇల్లు కనిపిస్తుంది. సుస్మితా సేన్ కేవలం నివాసం పరంగానే కాకుండా.. కార్ల కలెక్షన్ విషయంలోనూ లగ్జరీని ఇష్టపడతారు. ఆమె గ్యారేజీలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ప్రీమియం బ్రాండ్ కార్లు ఉన్నాయి. వీటిలో లగ్జరీ ఎస్‌యూవీలతో పాటు ఖరీదైన సెడాన్ కార్లు కూడా ఉన్నాయి. ప్రయాణాలలో కంఫర్ట్ ..రాయల్టీకి ప్రాధాన్యత ఇచ్చే సుస్మిత ఖరీదైన వాహనాలలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ కెమెరాల చిక్కిన సంద‌ర్భాలెన్నో.

సుస్మిత‌కు సొంతంగా దుబాయ్‌లో ఉన్న జ్యువెలరీ బొటిక్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో దుబాయ్‌లో ఈ లగ్జరీ జ్యువెలరీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బొటిక్ ద్వారా వైవిధ్యమైన, అరుదైన డిజైన్లతో కూడిన ఆభరణాలను అంతర్జాతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆ ర‌కంగా విజయవంతమైన బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. మొత్తంగా సుస్మితా సేన్ ప్రయాణం వెండితెర విజయాలకే పరిమితం కాలేదు. గ్లామర్ ప్రపంచంలో తారలు ఎంత వేగంగా మెరుస్తారో? అంతే వేగంగా మరుగున పడిపోతారనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ యాభై ఏళ్ల వ‌యసులోనూ స‌త్తా చాటుతున్నారు. తన బ్రాండ్ వాల్యూని .. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మిస్ యూనివర్స్‌గా కెరీర్ ప్రారంభించి 100 కోట్ల విలువైన సామ్రాజ్యానికి అధినేత్రిగా మారిన సుస్మితా సేన్ జీవితం ఎందరికో ఆదర్శం.

Tags:    

Similar News